పుట:హాస్యవల్లరి.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వీళ్ళంతా పిశాచాల్లా పట్టుగున్నారు. “మీ వాటాలు ఇదైపోనూ, అల్లానే చూడచ్చు లెండర్రా! పోనీ, ఇంకా ఎంతమందికి బహుమతీలో వాటాలున్నాయో కనుక్కుని మధ్యవర్తుల్ని పెట్టి వ్యాపార పరిష్కారం చేయిత్తాం, ముందు అసలుమనిషి దాటిపోకుండా పట్టుగుందాం నడవండి', అని నేను గట్టిగా అన్నాను. అతడు కోటవేపుకి వెళ్ళాడని కొందరన్నారు. కార్ని ఆ రోడ్డుమీంచి గెంటి, పెద్దరోడ్డుమీదికి ఎక్కించి, అంతా కిటకిట లాడుతూ కార్లోనూ కారుమీదా ఎక్కి కూచున్నాం. క్షణంలో కారు కోటదగ్గిరవాలింది. లక్షారావు ఏకోర్టులోకో వెళ్లి అప్పుడే తిరిగి వచ్చేస్తున్నాడు. కొందరెళ్ళి వాకబుచేశారు. వాడికోర్టు చల్లగా ఉండా, అది దివాలాల కోర్టుట, వాడివాయిదా అక్కడట.

అని డాక్టర్ ధనాధన్ వైద్యవృత్తాంతం చెప్పి ఆగాడట. పోనీ మీరు అడ్వాన్సుగా కట్టిన సొమ్ము తెచ్చుగున్నారా?' అని ఆయన భార్య అడిగిందిట. ఆ సంగతి తను అప్పట్లో మరిచా ననిన్నీ, మళ్ళీ వెళ్ళి తెచ్చుగోవాలనిన్నీ ఆయన అన్నాడట.

- జనవరి, 1939

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

155

హాస్యవల్లరి