పుట:హరివంశము.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 2.

49


చరితంబు లగు గురుశుశ్రూషణంబు తపంబు నివృత్తిధర్మంబు నను నివి [1]విఫలం
బులు గా కునికి నందఱు బ్రహ్మవాదులు యోగనిరతులు నై యుండునెడ.

193


ఉ.

భ్రాజితతేజుఁ డుత్తముఁడు పౌరవవంశవివర్ధనుండు వి
భ్రాజుఁగు కామినీజనపరంపర గొల్వగఁ గేళికౌతుకో
ద్యోజితచిత్తుఁ డై ప్రమదదోహల మొప్పఁగ నేఁగుదెంచె న
వ్యాజవిభూతిఁ దత్సరిదుపాంతవనాంకమనోజ్ఞభూమికిన్.

194


వ.

ఇతనిం జూచి స్వతంత్రుం డను[2]విహంగమంబు తన మనంబునఁ గోర్కి మిక్కుటం
బై యి ట్లనియె.

195


క.

భరపడి యుపవాసంబులు, జిరతపమునఁ బొరలి పొరలి [3]చివికితి నే ని
న్నరపతిక్రియ నఖిలసుఖోత్తర మగు జన్మంబుఁ [4]బొందెదను బ్రియ మెసఁగన్.

196


తే.

నాకు నింతటి సుచరిత్రపాక మొకటి, గలిగె నే నిట్టిదయ యగుఁగాత యనఁగ
మఱియు రెండుఖగంబు లమ్మాటవలని, యాదరం బగ్గలింపంగ నతనిఁ జూచి.

197


క.

భూపతిపై యటు పుట్టిన, నీ[5]ప్రెగడల మగుట మాకు నిక్కము వాంఛా
రూపం బని వలుకఁ దదా, లాపము లాపక్షి సముపలాలన చేసెన్.

198


వ.

తక్కిన చక్రవాకంబులు నాలుగు నప్పులుఁగుతో నీవు యోగధర్మనిష్ఠుండ వై
కామప్రధానం బగుచరితం బపేక్షించితి గావున నీకోర్కి దప్పకయుండఁ గాంపిల్య
నగరేశ్వరుండ వయ్యెదవు వీరు నీకు సఖులు గాఁగలవా రనిన నది నిజం బగు
టకుం దలంకి [6]యమ్మువ్వురు నమ్మహాతులం బ్రార్థించిన వారియందు సుమనసుం
డి ట్లనియె.

199


సీ.

ఇంకను ఖగజన్మ మీయేడ్వురకుఁ గల దటమీఁద నీ స్వతంత్రాహ్వయుండు
సర్వజంతువులభాషలు నెఱింగెడినట్టి రాజతనూభవుఁ డై జనించు
నితనికారణమునఁ బితృహితార్థంబుగ నగ్గోవు వధియించి యందఱమును
దారుణం బైన యథర్మంబు ధర్మంబుగా నొందఁ గంటిమి గాన యితఁడు


తే.

మనకు సద్గతిహేతువు వినుఁడు మీర, లట్లు జన్మించియుండ నే మన్యముఖము
నందు వినుతింప నొక్కవాక్యంబు వినిన, యపుడ సిద్ధించు బరమబోధాప్తి మీకు.

200


వ.

ఇది నిక్కం బనియె వార లమ్మేనులు విడిచి మానససరస్సున హంసయోనిం
బుట్టి పూర్వనామంబులన పరఁగి పవనాంబుభోజను లై శరీరశోషణంబులు సేయు
చుండ నక్కడ విభ్రాజుండును నణుహుం గనియె నతనికి శుకుండు తనకూతుఁ
బత్నిగా నిచ్చె నంత.

201


మ.

తనయుం బట్టముగట్టి పౌరులు నమాత్యశ్రేణియున్ విప్రులున్
దనుఁ బూజించి ముదంబుతో ననుప నాధాత్రీశ్వరుం డర్థిమై

  1. వివిధంబులు
  2. విహంగంబు
  3. చిక్కితి
  4. బొందఁగాఁ
  5. పెగడల ప్రగడల; పెగడల.
  6. యప్పు డమ్మహాత్ములం