పుట:హరివంశము.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

హరివంశము


జనియె న్మానసతీరభూమీఁ దప మాశ్చర్యంబుగాఁ జేసెఁ బే
ర్చిన కోర్కుల్ గదియంగనీని హృదయస్థేమంబు సంధిల్లఁగన్.

202


వ.

ఆ రాజతపస్వి య ట్లుండియు నప్పుణ్యపతత్రుల యోగనిష్ఠ నాలోకించి జన్మాంత
రంబున దీనిలో నొక్కటికిఁ బుత్రుండ నై యోగసిద్ధి వడయుదు నని సంకల్పంబు
నేసెఁ బరమతపోవిభ్రాజుం డైన యా విభ్రాజువలన భ్రాజిల్లుటం జేసి యక్కాన
నంబు వైభ్రాజంబు నాఁ బరఁగె నక్కొలనికి వైభ్రాజం బను నామాంతరంబు
గలిగె నయ్యేడ్వురుపక్షులయందు మున్ను యోగభ్రష్టుం డైన స్వతంత్రుం
డణుహునకు బ్రహదత్తుండై పుట్టె జిత్రదర్శనసునేత్రులు విప్రులై జనియించి
బాభ్రవ్యకండరీకు లనుపేళ్ల నతనికి మిత్రత్వంబు నొంది నమ్మువ్వురుఁ గృతాధ్య
యనులును నఖిలకళాధికులు నయ్యును బూర్వజన్మంబు లెఱుంగనీని యజ్ఞానం
బులు మనంబునం బొదువ వర్తిల్లుచుండి రందు.

203


సీ.

బ్రహ్మదత్తునకు బాభ్రవ్యుఁ డా[1]దార్యకం బొనరించు నధ్వర్యుఁడును సమస్త
కర్మసఖుండు నై కండరీకుఁడు శ్రుతిద్వయపారగుఁడు ప్రసిద్ధతఁ జరించు
నెమ్మెయి నెనసి యనేకవాంఛానురూపము లగు దివ్యభోగములు దమకుఁ
జుబ్బనచూఱ లై సొగయింపఁ వా రుండ నణుహుండు గొడుకు రాజ్యాభిషిక్తుఁ


తే.

జేసి యోగాత్ముఁ డై నిత్యసిద్ధి వడసె, రాజసుతుఁడును దేవలప్రభవ యైన
చెలువ సన్మతిఁ బెండ్లి యై చిరగృహస్థ, ధర్మ మొప్పంగ రాజ్యతంత్రంబు నడపె.

204


వ.

తక్కిన నలువురు పక్షులు గాంపిల్య[2]నగరంబునంద యొక్కశ్రోత్రియునకుఁ బుత్రు
లై పుట్టి జాతిస్మరత్వం బెడత్రెవ్వక వేదవేదాంగవిజ్ఞానంబును బరమార్థవేదతియు
ననవరతపరమయోగధ్యానాసక్తియుం గలిగి ధృతిమంతుండు సుమనుండు
విద్వాంసుండును తత్వదర్శియు నను నభిధానంబులం బ్రసిద్ధు లై యందఱు
[3]నేకమతం బగు సంకేతంబున.

205


మ.

భవనంబుం బెడఁబాసి సిద్ధపదవీప్రస్థానముం జేయుపొం
టె వినమ్రాంగకు లై మహాత్ముఁ డగు తండ్రిన్ వీడ్కొనిం బోవ న
య్యవనీదేవుఁడు వారిఁ జూచి యకటా యాత్మోద్భవుల్ నల్వురం
బ్రవరాచారులఁ గంటి మంటి నని హర్షం బొంది యే నున్నెడన్.

206


ఉ.

పుట్టినఁ గోలె నావలనఁ బొందిన పేదఱికంబు మాన్ప కీ
పుట్టువు మీకు ధన్యముగఁ బూజితుఁగా ననుఁ జేయ కెంతయున్
దిట్ట లనంగ విద్యయు వినీతతయున్ వెలయింప కిమ్మెయిన్
గట్టిడిపూన్కి నిల్లు దొరుగం దగునే సుతులార యిత్తఱిన్.

207


క.

అనుటయు వా రిట్లని రిం, తననేటికి నేము నీకు నఖిలంబు నొన
ర్చినవారమ యొక్కవెరవు, విను నీదారిద్ర్యదోషవిభరంబునకున్.

208
  1. చార్యక మొనరించు
  2. పురంబు
  3. నేకసమయం బగు