పుట:హరివంశము.pdf/96

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

హరివంశము


కాక యని యందఱు నగ్గోవు విశసించి విధివిహితంబుగాఁ బితృతర్పణంబు సేసి
తచ్ఛేషోపయోగంబునం బ్రీతులై నిజనివాసంబులకుం జనుదెంచి.

185


క.

పులి వచ్చి తినియె ధేనువు, నలఘుమతీ క్రేపు దప్పె నదె కైకొనుఁ డి
రలుగకుఁ డని గురుముందటఁ, బలికి రతండును ఋజుస్వభావుం డగుటన్.

186


తే.

అది నిజంబుగాఁ గొనియె న ట్లధమకర్మ, కుశలు లగువారు తుదిఁ గాలగోచరత్వ
మొంది యందఱు లుబ్ధకయోనియందు, జాతు లైరి దశార్ణదేశమున ననఘ.

167

కౌశికపుత్రులు గురువరువంచనంబున హీనజన్ములై పుట్టినప్రకారము

వ.

ఇత్తెఱంగున నేకోదరులై పుట్టి తొలుపుట్టువునం జేసినహింసయు గురువంచనయుఁ
గారణంబులుగా నట్టిదుర్జన్మంబు సంభవించినను బితృపూజనంబు కతంబున
జాతిస్మరత్వంబును ధర్మరుచియును వర్ధిల్ల నేడ్వురు నిర్వైరుండును [1]నివృత్తియు
క్షాంతుండును నిర్మన్యుండును గృతియు [2]వైపరియసుండును మాతృవర్తియు
ననుపేళ్ళు గలిగి.

188


చ.

అనృతము లేక లోభరహితాత్మకులై నిజజాతియోగ్యతం
దనరిన హింస ప్రాణచయధారణమాత్రయకాఁ జరించుచున్
వినయము విస్తరిల్ల జననీజనకుల్ గడువృద్ధు లిష్టభో
జనశయనాదులం గరము సంతసిలం బరిచర్యసేయుచున్.

189


వ.

కొంతకాలంబు వర్తిల్లి తల్లిదండ్రులు కాలధర్మంబు నొందినపిమ్మటఁ గార్ముకంబులు
పరిత్యజించి వనంబున నిరాహారులై ప్రాణంబులు విడిచి రిట్లపరగతిం బొంది
[3]కాలాంజనపర్వతంబున నున్ముఖుండు [4]నిత్యవ్రతస్థుండు స్తబ్ధకర్ముండు విరోచనుండు
[5]వేదితుండు ఘస్మరుండు [6]నంది యను సంజ్ఞలు గల మృగంబులై జన్మించి.

190


క.

ఎప్పటి జాతిస్మరణము, దప్పక తముఁ జెంద నెందుఁ దగులనిమతులం
దొప్పెడువివేక మలవడ, నప్పుట్టువు నీఁగి రంచితాత్మసమాధిన్.

191


తే.

అవ్విశిష్టధర్మంబున నంతవట్టు, వారు నొక[7]యేటినీట నొప్పారునిసుక
తిప్ప జక్కవలయి పుట్టి దెలివిఁ దొంటి, బాములన్నియుఁ గానంగఁ బ్రకటనియతి.

192


వ.

సహచరీపరిగ్రహం బొల్లక తపస్విసేవితంబు లగుబ్రహ్మమౌనాధ్యయనాదుల
నంగీకరించి [8][9]సుమనుండును మునియును శుచివాక్కుండును [10]శుధ్ధుండును చిత్ర
దర్శనుండును సునేత్రుండును స్వతంత్రుండును ననునామంబులఁ బూర్వజన్మా

  1. నివృతియు
  2. విఘంసుండును
  3. కాలాంజర
  4. నిత్యవిత్రస్తుండు
  5. పండితుండు
  6. నాదిసోమాభిధానయు నను
  7. యేటిదండ
  8. సంస్కృతప్రతిలో సుమనసుండు, శుచిపాకి, శుద్ధి, పంచమ, చిత్రదర్శన, సునేత్ర, స్వతంత్రులు అను పేరులు.
  9. సుమనస్కుండును. (సం. ప్ర.) సుమనసుండును
  10. బండితుండును; భద్రదర్శనుండును.