పుట:హరివంశము.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

హరివంశము


[1][తే.

గ్రహణతిథు లమావాస్యసంక్రమము లధిక
ముఖ్యకాలముల్ పితృకార్యములకు ననఘ
యపరపక్షంబు మేలు మూఁడష్టకలును
నాగ్రహాయణసమయంబు లగ్రిమములు.

131


క.

అనురూపదినముల గృహ, స్థునిగృహమును గుఱిచి వాంఛతోఁ బితృగణముల్
సనుదెంచు నివాసస్థల, ము[2]నకుం జనుదెంచు గోసమూహములక్రియన్.]

132


తే.

అష్టకలఁ బితృకోటియభ్యర్చనంబు, గాన కరిగిన నుభయలోకములుఁ దప్పు
నరున కవ్విధియం దొందు నాస్తికత్వ, మొప్ప దనుపమశ్రద్ధ యత్యు త్తమంబు.

133


సీ.

పాడ్యమిఁ బితృపూజ పాటింపఁ గాంచనాగమము భాసురపశూత్కరము విదియ
దదియ శాత్రవగణధ్వంసంబు చవుతిఁ బరచ్ఛిద్రదర్శనప్రాప్తి ప్రకట
లక్ష్మి పంచమి[3]ఁ గీర్తి లాభంబు షష్టి సప్తమి మహిపర్వప్రధానశక్తి
యష్టమి నవమి నుత్కృష్టతయును బ్రభుత్వము బ్రహవర్చసవ్యాప్తి దశమి


తే.

వేదసమ్మతైశ్వర్యంబు వినుతవేద, వాదితయును నేకాదశి వసుమతీశ
పదము జయమును బారసిఁ బ్రజల పెంపు, పుష్టతయును [4] ద్రయోదశిఁ బొందు [5]జనుల.

134


క.

తరుణవయస్సున సమసిన, పురుషులకును శస్త్రనిహతిఁ బొరసి తెగినయ
న్నరులకుఁ గర్తవ్యము పితృ, పరిచరణము భూతతిథిఁ దపస్పివరేణ్యా.

135


క.

అమవసఁ బితృనియతి ప్రయ, త్నమున నొనర్పంగ వలయు దత్క్రియ సోమున్
బ్రముదితుఁ జేయును సోమ, ప్రమదంబునఁ బ్రీతినొందు ద్రైలోక్యంబున్.

136


వ.

శశిబిందుఁ డడుగఁ బితృపతి పితృవిధానంబునందు నక్షత్రఫలం బెఱింగించెఁ
దత్ప్రకారంబు వినుము.

137


సీ.

కృత్తికఁ బైతృకక్రియ [6]జేసి విపులతేజంబు రోహిణిఁ బ్రజాసంప్రవృద్ధి
యోజస్సు మృగశిర నుగ్రక్రియాశుద్ధి యార్ద్రబుత్రప్రీతి యదితితారఁ
బుష్టి పుష్యంబున భుజగ[7]తారను బ్రభ సుతలబ్ధి పితృతార నతులబంధు
గణవరిష్ఠత పుబ్బఁ గమనీయసౌభాగ్య ముత్తరఁ బ్రచురదానోత్సవంబు


తే.

హస్తమున సంపదలు చిత్ర నధికరూప, వంత మగునపత్యము వణిగ్వైభవంబు
పవనుతార విశాఖ సత్పాత్రయుక్తి, మైత్రమునఁ జక్రవర్తిత్వమహిమ నొందు.

138


క.

శతమఖతార జనాధీ, శత యారోగ్యంబు విను నిశాచరతారన్
సితకీర్తి సలిలతారను, గతశోకత విశ్వతారఁ గలుగు జనులకున్.

139
  1. 131, 132 పద్యములు కొన్ని వ్రాత ప్రతులలో లేవు. ఈభావము మూల మగు సంస్కృతగ్రంథమున లేదు.
  2. మునకు నరుగు
  3. యశో
  4. ఁబుష్కలంబు
  5. ఁబ్రబల
  6. సేయ
  7. తారతిథిగ