పుట:హరివంశము.pdf/91

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 2

43


ఆ.

[1]అభిజిదానికంబు లగుమూఁట నాగమా, ఢ్యతయు సద్గతియును నర్థచయముఁ
[2]జెందు వెండి రెంటఁ జేకుఱు [3]నౌషధ, సిద్ధియును సమృద్ధజీవనంబు.

140


క.

గోవుల[4]పేర్మియు రౌప్యధ, నావాప్తియు హయవిభవము నాయువు పెనుపున్
గావించు నహిర్భుధ్నుఁడు, దైవత మగు తార దొడఁగి తక్కిననాల్గున్.

141


తే.

రజతదానంబు రజకపాత్రంబు రజత, కథయుఁ బితరుల కానందకరము తొల్లి
యంచితాస్పదరాజతమైన పాత్రఁ, బితరు లమ్మహీ[5]1దేవిని బితికికొనుట.

142


క.

రజతంబుభంగిన మహా, రజతంబును బితృహితమ్ము రమ్యతిలలు మే
షజకంబళమును దుహితృత, నుజుఁడుఁ గుతపమును బితృప్రణుతకారణముల్.

143


క.

ఆజ్యంబు నవూపంబులు, యోజ్యంబులు ముద్గమాషయుక్తము మాంస
ప్రాజ్యమునై [6]పితృగణముల, యిజ్యాతంత్రంబు నడచు (డి)టిచ్చు శుభంబుల్.

144


క.

విను కృష్ణమృగాజిన మి, చ్చినఁ జూపిన సన్నిహితము సేసినఁ బితృమో
దన మగుఁ ద్రిదండియగుయతి,యును యోగియుఁ బాత్రములు తదుత్తమపూజన్.

145


తే.

అనఘ పితృసమారాధన మాచరించు, నపుడు తత్క్రియ నాదిమధ్యాంతవేళ
లందు నియతిగ దేవతాభ్యః పితృభ్య, యనుమహాసూక్తి జపియించు డధికశుభము.

146


క.

విను పిండదానసమయం, బున యందును భక్తిపూర్వముగ దీనిఁ బఠిం
చిన నయ్యన్నం బమృతము, నెనయుఁ దురగమేధఫలము నిచ్చుఁ గృతాత్మా.

147


క.

రాక్షసులు దొలఁగుదురు ప్ర, త్యక్షత నొందుదురు పితరు లప్పుడు సుకృతం
బక్షయ మగు నీసూక్తి య, ఘక్షయకారిణిగఁ జదువు కళ్యాణులకున్.

148


సీ.

మూ ర్తివియుక్తులు మూర్తిమంతులుఁ బరిజ్ఞానులు యోగవీక్షణులు నైన
ప్రభు లింద్రముఖ్యనిర్జరులకు దక్షకశ్యపమరీచ్యాదిప్రజాపతులకు
సప్తమహామునీశ్వరులకు మున్వాదు[7]లకును సరిత్పతులకును శేష
నక్షత్రతారాగ్రహక్షోణీగగనంబులకుఁ [8]దండ్రు లిందుపావకమయాత్ము


తే.

లఖిలలోకైకదాతలు నఖిలవంద్యు, లాఢ్యు లధ్వరంబులును బ్రహ్మంబుఁ దార
యనఁగఁ బరఁగి సప్తనిధంబు లగుగణముల, నమరు పితరులఁ బ్రాంజలి నై భజింతు.

149


తే.

ఏడు[9]దీవులయం దర్చ్య మీస్తవంబు, పరఁగు సప్తర్చ మనుపేరఁ బరమపుణ్య
మజ్జభవుఁడు చెప్పినయది యధికసిద్ధి, కరము పితృగణసమ్మోదకారణంబు.

150


వ.

నీవు పితృభక్తుండవు కావున నుపదేశించితి విశ్లేషించి నాయందు సభక్తితాత్ప
ర్యం బగుచిత్తంబుతో వర్తిల్లుదు నీకుం బరమజ్ఞానసమేతం బగుదివ్యచక్షువు

 1. కొన్ని ప్రతులలో ఇది గీతము.
  అభిజిదాధికంబులు మూఁట నాగమాఢ్య, తయును సద్గతియును నర్థచయముఁ జేయు
  వెండి రెంటను జేకుఱు భేషజంబు, సిద్ధియును ద్విసమృద్ధ మాజీవనంబు.
 2. జేయు
 3. భేషజ
 4. పెంపునుఁగు
 5. ధేనువు
 6. పితరులకును, నిజ్యత
 7. లకు సరిత్పాశోధులకు నశేష
 8. లింద్రు
 9. దీవులందుల యర్థ