పుట:హరివంశము.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 2

41


క.

భూవరులు వారి నెప్పుడు, భావింతురు తన్మనఃప్రభవ యైనయశో
దావినుతాహ్వయ గన్నియ, యావిశ్వమహత్తుపత్నియై కడుఁబేర్మిన్.

123


వ.

దిలీపాభిధానుం డయినమానవపతిం గనియె నతని తురంగమేధంబునం దృప్తులైన
భూదేవత లితండు లోకపావనుం డీయజమానుం జూచినవారికి నిమ్మహాత్ముతోడ
నవబృధస్నాతులైనవారికి నక్షయస్వర్గం బగు ననువాక్యంబు లుగ్గడింతురు.

124


సీ.

పులహనందనుఁ డగుభూరిపుణ్యుఁడు కర్దమప్రజాపతికి నాత్మజులు వసువు
లనుపేరిపితరు లుదాత్తతేజులు గామదము లనఁబరఁగు లోకములయందు
వెలుఁగొందుదురు వైశ్యకులమున కర్చనీయులు వారి మనసున నుద్భవించి
కన్నియ నహుషునిగాదిలిదేవియై [1]వైధాత్రి యనునది వసుమతీశు


ఆ.

నయ్యయాతిఁ గాంచె ననఘ హిరణ్యగ, ర్భాత్మజాతుఁ డైన యవ్వసిష్ఠ
సుతులు వేఱె కలరు [2]సుకలాఖ్యపితరులు, వారు శూద్రవర్ణవంద్యు లెందు.

125


క.

మానసము లనం బరఁగిన, మానితలోకములు వారిమహితపదంబుల్
మానససుత వారికి రే, వానది పురుకుత్సధరణివరుభార్య మహిన్.

126


వ.

పితృగణంబుల రూపంబులు లోకంబులు వినియోగంబులు వేర్వేఱ వివరించితిఁ
బితృసమారాధనంబు సర్వయుగసాధారణంబు.

127


క.

పితృవిధి యెక్కుడు విను దై, వతకార్యముకంటె దివిజవరదానవసి
ద్ధతపస్వితతికిఁ బూజ్యులు, పితరు లనుచుఁ జెప్పు శ్రుతు లభిన్నప్రతిభన్.

128


మ.

 సుతసౌభాగ్యజయాయురర్థసుఖితాశుద్ధిక్షమావైభవ
స్మృతివిద్యావినయాదిసర్వశుభమున్ జెందించు వైరాగ్యసం
యుతవిజ్ఞానము మృత్యుమోచనమహాయోగంబుఁ గైవల్యక
ల్యతయుం జేయుఁ బితృప్రయోజనఫలం బల్పంబె యూహింపఁగన్.

129

పితృదేవతాసమారాధనఫలవిశేషప్రభావము

సీ.

స్వర్గకాములు పితృవర్గంబు గొనియాడి యిహలోకసుఖలీల లెల్లఁ గాంచి
మౌక్తికమాణిక్యమరకతమయములై యమరుకాంచనవిమానములు వచ్చి
హంససారసమయూరాభియుక్తంబులై తముఁ గొనిపోవ గంధర్వగీత
లప్సరోలాస్యంబు లనిమిషసిద్ధచారణకీర్తనంబులు రమ్యములుగఁ


తే.

జని యనేకమనోరథసంప్రణీత, వివిధవిషయానుభవములఁ దవిలి పెక్కు
యుగసహస్రము ల్విహరింతు రూర్ధ్వలోక,పదము లెన్ని యన్నింట నొప్పిద మెలర్ప.

130
  1. వైరాజి యన నది; వీరాజి యమనది వీరవర్యు.
  2. సకలాఖ్యపితరు లనునది సంస్కృతమున లేదు.