పుట:హరివంశము.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ 2

31


విశ్వసనీయం బగు ప్రభుత్వంబు [1]పెంపొనర వసిష్ఠుండు గరిష్ఠం బగునాజ్ఞాబలం
బున రక్షించుచుండ నటమున్న.

40


సీ.

తనకుటుంబంబును దద్దేశమునఁ బెట్టి వినుము విశ్వామిత్రమునివరుండు
సాగ[2]రోపాంతికస్థలిఁ దీవ్రతపమున వర్తింప నప్పెనువఱపునందు
గూడులే కాతనిచేడియ మువ్వురుకొడుకులలోపుల నడిమివాని
మెడఁ ద్రాడువోసి యమ్మెద నూఱుగోవుల కెవ్వరేఁ గొనుఁ డనునెడ నెఱింగి


తే.

కరుణ సత్యవ్రతుం డిది గాదు గూడ, దేన ప్రోచెద నిందఱ నిది నిజంబు
విడువు మని గళబంధంబు విడిచె వాని, కయ్యె గాలవుఁ డనునామ మవ్విధముగ.

41


వ.

ఆరాజపుత్రుండు విశ్వామిత్రునివాఁ డయ్యెడడుకొఱకును గృపావశంబునను
విప్రకుటుంబ[3]పోషణంబు పుణ్యం బను బుద్ధివలనను [4]నిరతంబును మృగమహిష
వరాహాదివన్యసత్వంబుల నబ్బినవానిం జంపి తెచ్చి కౌశికకళత్రపుత్రసముద
యంబున కొసంగుచు నదియ మహనీయం బగు యజనంబుగా సంకల్పించి ద్వాదశ
[5]3వార్షిక యగు మానసదీక్ష వహించి పికృవాక్యకరణంబును దప్పకుండ నడపిన
వాఁడై వర్తిల్లె నవ్వర్తనంబున.

42


క.

తనుఁ దొరఁగు తండ్రి నుడుపడ మునివరుఁ డని యతనిచిత్తమున నేప్రొద్దున్
బెనుపగు కోపంబు వసి, ష్ఠునిదిక్కునఁ గలిగె నొక్కచో నట్టితఱిన్.

43


వ.

అక్కుమారుఁ డెక్కడఁ దిరిగియు మాంసంబు గానక కామదోహిని యగు వసిష్ఠు
హోమధేనువుం గని.

44


తే.

ఆఁకటను నీరువట్టున నగ్గలంపు, డప్పిఁ బులుగు[6]1ను నొకచోటఁ జొప్పడమిని
దొంటిపగను నెట్టన కిరాతుండపోలెఁ, జంపి యగ్గోవు[7]రక్తమాంసములు గొనియె.

45


సత్యవ్రతుం డను రాజు వసిష్ఠవచనంబునఁ ద్రిశంకుండైన ప్రకారము

వ.

అది యెఱింగి వసిష్ఠుండు గనలి యోరీ నీవు తండ్రిచిత్తంబునకు రామియు గురు
దోగ్ధ్రీవధంబును నప్రోక్షితమాంసోపయోగంబు ననుమూఁడుతెఱంగుల హృద
యశంకువులు గావించితి గావున త్రిశంకుండ వైతి ని న్నేమి సేయనేర్తుం బొమ్మ
నియె నిట్లు సత్యవ్రతుండు గురువాక్యంబునఁ ద్రిశంకుం డన నెందును వివం
బడియ నంత.

46


తే.

కఱవు [8]దీఱెను నాలిని గన్నప్రజల, వెదికికొని వచ్చి కౌశికుం డుదితమహిమ
నానరేంద్రనందను[9]చేత కాత్మలోన, నగ్గలము మెచ్చి వర మిత్తు నడుగు మనిన.

47


క.

తనకుఁ గ్రతుదీక్ష నుపద, ర్శన మొనరింపు మని వేఁడె సత్యవ్రతుఁ డ
మ్మునిసింహుఁడు నొడఁబడియెఁ ద, దనురూపద్రవ్యసంచయంబులు గూర్పన్.

48
  1. పెంపున సొంపార వసిష్ఠునియాజ్ఞాబలంబున వర్తిల్లె నయ్యఖిలంబుమ సురక్షితం బయ్యె
  2. రానూపక
  3. పోషణంబను
  4. నిత్యంబును
  5. పర్షి
  6. మృసంబులు: మృగంబొండు
  7. మేనిమాంసంబు
  8. దేలిన; దేరిన
  9. సేగి