పుట:హరివంశము.pdf/78

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

హరివంశము


పైతామహం బగునస్త్రంబునం బగతుం బడవైచి తదీయకాయం బుదంకునకుం
జూపి సమ్మోదం బాపాదించిన నమ్మహాతపస్సిద్ధుండు.

32


చ.

నృపునకుఁ బ్రాజ్యరాజ్యపదనిత్యతయున్ సుకృతైకబుద్ధియున్
రిపుజయలక్ష్మియున్ శుభగరిష్ఠముగాఁ దుది దివ్యవైభవా
భ్యుసగమము స్వరంబులుగ నొ ప్పెసఁగన్ గృపసేసి సంగర
క్షపితసుతాళి కక్షయసుఖం బగునాకము నిచ్చె నచ్చటన్.

33


వ.

కువలయాశ్వుండును మునీంద్రు, వీడ్కొని పురంబున కరుగుదెంచెఁ దత్పుత్రులు
మువ్వురయందును పెద్దవాఁడగు దృఢాశ్వుండు వంశకరుం డయ్యె నతనికి
హర్యశ్వుండు నాతనికి గుంభుండు నమ్మహీపతికి సంహితాశ్వుండును బుట్టి
రన్నరపతి యకృతాశ్వుండును గృతాశ్వుండు నన నిద్దఱం గాంచె
నృతాశ్వునకుఁ బ్రసేనజిత్తును బ్రసేనజిత్తునకు యువనాశ్వుంకును యువనాశ్వు
నకు మాంధాతయు నుద్భవించిరి.

34


సీ.

శశిబిందుఁ డను జనేశ్వరు పదికోటుల కొడుకులకును బెద్దగుణనిధాన
మగు బిందుమతి భార్య యయ్యె వయ్యువనాశ్వసుతున కమ్మాంధాత శూరవర్యుఁ
డుదయార్కనిభతేజుఁ డుదయాస్తశైలపర్యంతభూచక్ర మత్యంతమహిమ
నేల తనూజుల నిరువురఁ బురుకుత్సు ముచికుందుఁ గనియెఁ బ్రమోదలీల


తే.

నందుఁ బురుకుత్సుఁ డిందుజ యైనతటిని, యాలుగాఁ గాంచెఁ ద్రసదశ్వు నవ్విభుండు
పుత్రు సంభూతనాము సంభూతుఁ జేసెఁ, దత్తనూజుఁడు పరఁగెఁ ద్రిధన్వుఁ డనఁగ.

35


వ.

ఆత్రిధన్వునకు సూర్యారుణుండు పుట్టి యుత్తరకోసలంబులు శాసించుచు సత్య
వ్రతుం డనుసుతునిం గనిన నక్కుమారుండు కృత రపరిగ్రహుండై యంత
నిలువక.

36


తే.

[1]వరుఁడొకఁడు పెండ్లియైనయబ్బాలఁ దాను, బాల్యమున నీసుననుఁ జెల్లుబడిని బుచ్చు
కొనిన నవ్విధం బెఱిఁగి తజ్జనకుఁ డలిగి, తిట్టి వెడలిపొమ్మనుడుఁ బార్థివసుతుండు.

37


క.

ఎక్కడి కేఁగుదు ననినన్, గుక్కలఁ జంపితినుజనులఁ గూడి తిరుగు నీ
దిక్కునఁ బుత్రుఁ డనుమమత, నెక్కొన దేమియుసు నాకు నిజము దురాత్మా.

38


చ.

అనుటయుఁ దండ్రివాక్యమున నాతఁడు వెల్వడిపోయఁ బట్టణం
బనఘ పురోహితుం డయినయట్టి వసిష్ఠుఁడు నూరకుండెఁ బు
త్రుని నటు పాఱవైచి నిజధుర్యతమంతయు నుజ్జగించి కా
ననమున కేగె భూవిభుఁ డనాథయైఁ [2]1గుందె ధరిత్రి యంతయున్.

39


వ.

అయ్యధర్మంబువలనఁ దద్విషయంబునం బండ్రెండేండ్లు పర్జన్యుండు వర్షింపక
నిలిచె నమ్మెయిం గలఁగు రాష్ట్రంబును బురంబును నంతఃపురంబును శాసించి

  1. సౌరుఁ డొక్కండు పెండ్లైన బాల (పూ. ము.) యైన నబ్బాల
  2. నుండె