పుట:హరివంశము.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

హరివంశము


వ.

సర్వగీర్వాణవరిష్ఠులు వసిష్ణుండునుం జూచుచుండ నతనిం బూజ్యరాజ్యాభిషేక
పూర్పకంబుగా నఖర్వగర్వోత్తేజం బగు యాజనంబునం బూజనార్హునిం జేసి
శరీరంబుతోడన దివంబునకుం బుచ్చె నట్టి సత్యవ్రతుభార్య కేకయకన్య సత్యవ్రత
యనునది హరిశ్చంద్రునిం గని నమ్మనుజేంద్రచంద్రుండు.

49


మత్తకోకిల.

తేజ మొప్పఁగ విస్ఫురద్బుజదీప్త[1]కేళికృపాణిచే
రాజవంశసమాజ మెల్లఁ బరా[2]జయంబున [3]మ్రగ్గఁగా
రాజసూయము సేసి సర్వధరాజనంబులఁ బ్రోచి [4]
మ్రాజనం బెనుపొందె నిందు విరాజి[5]5తామలకీర్తులన్.

50


క.

అతనికి లోహితుఁ డనియెడి, సుతుఁ డుద్భవ మయ్యె వృకుఁడు సుతుఁ డాధరణీ
పతికి వృకసుతుఁడు బాహుఁడు శ్రుతవంతుం డయ్యెం గామసుఖసక్తిమెయిన్.

51


వ.

[6]రాజ్యానుసంధానం బేమఱియుండ నయ్యడరున హైహములు శకయవనకాం
భోజ[7]పారదోపప్లవులం గూర్చుకొని యతనిపై నడతెంచి రాజ్యంబు గొనుటయు.

52


ఉ.

బాహుబలంబు మోఘముగ భామిను లిద్దఱుఁ దోడరా వెస
న్బాహుఁడు వోయి ఘోర[8]విపినంబులు దూఱి మడంగి యుండి దుః
ఖాహతచిత్తుఁడై యచటఁ బ్రాణవియోగము నొందె నంతఁ ద
ద్గేహిని [9]సారగర్భవతి తీవ్రపుశోకము సైఁపఁజాలమిన్.

53


క.

పతితోడ నగ్ని సొర ను, ద్యత యగుటయుఁ జూచి యప్పు డనుకంపాకం
పితమతియై భార్గవకుల, పతి యౌర్వుఁడు సావు మాన్చి బంధుఁడ పోలెన్.

54


వ.

నిజాశ్రమంబున నిడుకొని రక్షింప నట తొల్లి సవతి సూపోపక చూలు సెడుటకై
పెట్టిన బెట్టిదంపుగరళంబు తనయుదరంబునన యుండ నయ్యువిద ప్రసూతయయ్యె
నవ్విధంబు తనదివ్యభావంబున నెఱుంగుం గావున [10]నమ్మునిదేవుం డట్లు
జనియించిన కొడుకునకు గరంబుతోడన గర్భంబున నునికిం జేసి సగరుం డను
నామం [11]బాచరించి.

55


క.

క్రమవర్ధితుఁ డగుబాలుని, సమస్తవేదముల వివిధశాస్త్రములఁ బరి
శ్రమశాలిఁ జేసి రిపువి, క్రమ[12]మర్దనచండిమాగ్నికాండం బొసఁగెన్.

56


శా.

ఆదివ్యాస్త్రముపేర్మిఁ జేసి [13]పటుబాహాశక్తి [14]నుద్రిక్తుఁడై
యాదుర్వారబలుండు క్రోధమతి [15]వశ్యంబై చనన్ హైహయ
చ్ఛేదక్రీడ యొనర్చి వెండి వర మై జెండాడెఁ [16]4దన్మిత్రులం
చాదిం దండ్రికిఁ గీడు చేసిన యవనశకామిత్రధాత్రీశులన్.

57
  1. కౢప్త, లుప్త.
  2. క్రమంబున.
  3. ద్రుంగఁగా.
  4. సాంమ్రాజతం.
  5. తంబగు
  6. రాజ్యసంధానం బమరియుండ.
  7. పారదపహ్లవులం.
  8. గహనంబులు
  9. చారు
  10. నమ్మునీంద్రుం.
  11. బొనరించి.
  12. విదుఁడుగవస్త్రమగ్నిరాంతం.
  13. తన
  14. యుద్రిక్తమై
  15. ధైర్య; ధన్య.
  16. దన్మిత్రులన్ ఆదిన్