పుట:హరివంశము.pdf/77

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 2.

29


వ.

ఆర్ద్రునకు యువనాశ్వుండు జనియించె యువనాశ్వునకు శ్రావస్తుఁడు పుట్టి [1]శ్రావ
స్తి యనుపురంబు నిర్మించెఁ దత్తనూజుం డగుబృహదశ్వుండు కువలయాశ్వుం
గనియె నతండు పుత్రపౌత్రశతవంతుండైనపిదకు నాత్మీయవిభవంబు [2]తత్పుత్రుల
కిచ్చి తపోవనంబున కరుగ నున్న [3]నుదంకుం డను బ్రహ్మర్షి వచ్చి యిట్లనియె.

25

కువలయాశ్వుండు దుందుండను రాక్షసునిం జంపిన ప్రకారము

సీ.

మధువను నసుర కాత్మజుఁడు క్రూరుఁడు దుండుఁడను దానవుఁడు మదీయాశ్రమంబు
చేరువ నంభోధితీరవాలుక బిలమునను నిద్రించి పెల్చనను నేఁట
నొకమాటు నిడుదయూ ర్పూర్పంగ మంటయుఁ బొగలుఁ బెంధూళితో నెగసి నభము
గప్పు [4]నావనభూమి కంపంబు సప్తవాసరములు ఘోరమై పరఁగు నధిప


తే.

యోర్వరాదు [5]మా కయ్యెడ నొక్కమాక, కాదు సర్వభూతములకుఁ గరము బాధ
యట్లు గావున నవ్విబుధారిఁ దునిమి, వెండి చనుము తపంబు గావించుపనికి.

26


వ.

అమ్మహాదైత్యు వధియింపం బూనువానికి నాత్మీయతేజంబున నాప్యాయనం
బొసంగి జయంబు గావింతు నని నారాయణుండు నాతో నానతిచ్చె నీవు దక్క
నెక్కటి వానిం బరిమార్ప నమరులయందును శక్తుండు లేఁ డట్లు చేయు మనిన
నన్నరేంద్రుండు.

27


క.

విను శస్త్రసన్యాసం బే, నొనర్చి తపమునకు దీక్ష నొందితి నింకన్
జనునే [6]క్రౌర్యంబు భవ, ద్వినియుక్తియుఁ జెడక యుండువిధ మొనరింతున్.

28


వ.

అని తదాజ్ఞాకరణంబునకుఁ బుత్రసమేతుం డగునాత్మజాతు నప్పగించి యప్పరమ
తపస్విచేత ననుజ్ఞాతుండై యాతం డరిగెఁ గువలయాశ్వుండు నుదంకు
మున్నిడుకొని కొడుకులతోడ ససైన్యంబుగా రక్కసుపై నడచె నప్పుడు.

29


ఉ.

ఈతఁడు దుందునిం దునిమీ యెల్లజగంబుల దుందుమారవి
ఖ్యాత[7]పదైకభాజనత నందెడు నంచు దివంబునన్ సుర
వ్రాతము వల్కుచుం గుసుమవర్షము దుందుభిస ప్రణాదమున్
బ్రీతి ఘటించుచుండె మునిబృందము సమ్మదమందె నెంతయున్.

30


క.

వారిజనాభునితేజం, బారాజోత్తమునియాత్మ యం [8]దొలయఁగ ఘో
రారిజయహేతుభూత, స్ఫారవికాసమయి యతనిభావం బలరెన్.

31


వ.

అట్లరిగి యమ్మహాతేజుండు తనూజులం బనిచి సముద్రసికతాఖననంబు సేయించి
తన్మధ్య సుప్తుం డగుదనుజుం గదిల్చె నంత నమ్మహాసురనాసానేత్రవదనంబుల
వెలువడి యుదీర్ణదహనజ్వాలాజాలంబు భూపాలపుత్రులు మువ్వురఁదక్క ననేక
సహస్రంబుల భస్మీకరించి విస్మయావహంబై కదియ నతండు తనయోగవిద్య
వలన సప్రమేయంబగుతోయంబు నుత్పాదించి యాకృశానుం బ్రశమితుం జేసి

  1. శ్రాబస్తి
  2. తద్వంశంబున నునిచి
  3. నుత్తంకుం
  4. ఁగానన
  5. మా కయ్యెడు నొప్పు మాత్ర
  6. కార్యంబు
  7. విధైక
  8. దెలియఁగ