పుట:హరివంశము.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

హరివంశము


క.

ఒక్క ముహూర్తము [1]వనజజుఁ, డక్కడ గాంధర్వగోష్ఠియం దుండ భువిన్
బెక్కుయుగము లిటఁ బోయిన, నక్కజముగఁ దాను నప్పు ఉప్పరమేష్ఠిన్.

15


తే.

కాంచి మగుడ నేతెంచుచో ఘనులు వృష్ణి, [2]భోజవంశజుల్ కృష్ణుండు రాజు గాఁగ
నాకుశస్థలి ద్వారక యనఁగఁ బరఁగు, దివ్యనగరిగాఁ జేసి వర్తిల్లుచుండ.

16


క.

ఆతఁడు రేవతి నతివి, ఖ్యాతబలుండైన బలున కాత్మేశ్వరిగా
బ్రీతి నొసఁగి తపమునకై , గీతయశుం డరిగె మేరుగిరితటమునకున్.

17


సీ.

ఆఁకలి నీరువ ట్టలఁత జరారోగములు కాలగుణములు మొదలు గాఁగ
దోషంబు లెవ్వియుఁ దోయజభవులోకమునం బ్రభవింపవు మనుజనాథ
కాన రైవతుఁడు దక్కన్యయు వికృతులఁ బొందరై రతఁ డటవోయి యుండ
నిట తత్సహోదరు లేకోనశతమును నుండఁ గుశస్థలి [3]నుగ్రులైన


తే.

రాక్షసులు దోఁచికొనుటయు రాజసూను, లఖిలదిశలఁ జెల్లాచెదరైరి భీతి
నాకకుద్మికి సుతులు లే రయిరి గాని, తక్కుగలయందఱకును సంతతులు గలిగె.

18


వ.

తత్కులసంభవులు సర్వదేశంబులను శర్యాతు లన మహాక్షత్రియపూజ్యు లైరి
నాభాగునికులంబువా రన్నివర్ణంబులం గలిసిపోయి రరిష్టున కిద్దఱుకొడుకులు
గలిగి వైశ్యత్వంబు నొందిరి కరూషతనూజులు కారూషు లన వేర్వేఱ వంశకర
త్వంబు నొందిరి పృషధ్రుండు గురుహోమధేనువు వధియించి తదీయశాపం
బున శూద్రభావంబు నొందె నిట్లు వైవస్వతమనునందను లెనమండ్ర తెఱం
గులుం దెలిపితి నందఱకు నగ్రజుం డైన యిక్ష్వాకుండు.

19


క.

ఆనతులై మానవపతు, లానతి యౌదలలఁ దాల్ప నఖిలోర్వియు స
త్వానందుం డగుచు నయో, థ్యానగరము తనకు రాజధానిగ [4]నేలెన్.

20


క.

అతనికిఁ బుత్రులు నూర్వురు, ప్రతాపవిభవైకనిధులు ప్రభవించిరి త
ద్వితతికి నాద్యుఁడు తేజో, యుతుండు వికుక్షి యనునాతం డుర్వీశ్వరా.

21


వ.

శకునిప్రముఖు లయిన తక్కినకొడుకులు పూర్వోత్తరాపరదేశంబులకు వేర్వేఱ
శాసకు లైరి వికుక్షియు జనకనియోగంబున నొక్కనాఁడు పితృకార్యార్థంబు
శశమాంసంబు దేర నడవికిం జని బుభుక్షితుండై శశంబు భక్షించుటం జేసి శశా
దుం డనుపేర వసిష్ఠువచనంబునఁ దండ్రిచేతఁ బరిత్యక్తుండై తత్పరోక్షంబున
గురుండ యభిషేకింప నయోధ్యాపతి యయ్యె నతనికి.

22


క.

జనియించెఁ గకుత్థ్సుం డను, జనపతి [5]కాకుత్థ్సభవ్యసంజ్ఞ నిజకులం
బునవారికెల్లఁ దేజో, జనకంబై బెరయుఁ జిరయశశ్శ్రీయుతుఁడై.

23


తే.

విను మనేనుం డనఁగ నుద్భవించె నాక, కుత్థ్సునకు నయ్యనేనుండు కొడుకుఁ బృథునిఁ
గనియె విష్టరాశ్వుండు తత్తనయుఁ డతని, కార్ద్రుఁ డుదయించె జనకసౌహార్దశాలి.

24
  1. కమలజు
  2. భోజవరులునుఁ గృ
  3. క్రూరులైన
  4. మెలఁగెన్
  5. కాకుత్థ్సు లనఁగ