పుట:హరివంశము.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

హరివంశము


చ.

[1]గనగన యెల్లప్రొద్దు గొనిక్రాలెడు వేఁడిమిఁ బేర్చు భర్తమే
నెనయను డగ్గఱన్ సయిఁప కెంతయు భీతి నొదుంగుచున్ లస
ద్వనరుహపత్రలోచన యవంధ్యచరిత్రమునన్ దదాత్మకిం
పు నెఱయఁజేయుచుం గనియెఁ బుత్రుల నిద్దఱ నొక్కకన్నియన్.

170


వ.

వైవస్వతమనువును యముండును యమునయు నన నిట్లు మువ్వురం గనియు నవ్వ
రాంగి యోర్వలేక నిజచ్ఛాయం జేసి ఛాయయను[2]దానిం బుట్టించిన నది తనయె
దుర నిలిచి పని యేమి యని కేలు మొగిచి యున్న యన్నాతిం జూచి.

171


క.

[3]తాను బతివేఁడిమిఁ బరి, మ్లానాకృతియై కడుం దలంకేడు తెఱఁ గ
మ్మానవతికి నెంతయు స, మ్మానన నెఱిఁగించి యనియె మంజులరీతిన్.

172


ఆ.

పుట్టినింటి కేను వోయి యొక్కించుక, యూఱడిల్లి వత్తు నువిద నీవు
వింతతనము లేక విభునకుఁ బ్రియము నా, మాఱుగా నొనర్చి మనుము నెమ్మి.

173


క.

[4]మఱచి యయిన నాయిత్తెఱఁ, గెఱఁగింపకు పతికి బిడ్డ లీమువ్వురకున్
నెఱసినగారా మేమియుఁ, గొఱఁతవడక యుండ [5]నడపి కొఱలుము శుభమున్.

174


క.

నావుడు నది యాయమతో, దేవీ తల వట్టియీడ్చి తిట్టుకొలఁది రో
షావేశముఁ బతి యొందిన, నేవిధమున నిన్నుఁ జెప్ప నిది నిజ మనినన్.

175


వ.

సంప్రీతమానసయై సంజ్ఞాదేవి తండ్రిపాలికిం జని తనవచ్చినకారణం బెఱింగించి
సిగ్గునం దలవాంచియున్న విశ్వకర్మ యక్కొమ్మం బుజ్జవంబులుఁ దర్జనం
బులుఁ బెరయ నశ్రుకణకరాళకపోలం బగు తదాననం బాలోకించి.

176


క.

ఎంతయుఁ గ్రూరుం డయినను, శాంతుఁ డయినఁ బతియు చువ్వె సతి కారయ న
త్యంతపుబంధువు [6]తదతి, క్రాంతి దలంచుకాంత యెందుఁ గనునే శభముల్.

177


తే.

పొమ్ము నీప్రియు[7]పాలికి నమ్మతగదు, విడువు తలఁ కన్నీరు తుడిచి కూర్మిఁ
[8]గౌఁగిలించి వీడ్కొలిపినఁ గ్రమ్మఱంగఁ, బోక బెగ [9]డగ్గలింప నప్పువ్వుఁబోఁడి.

178


వ.

నిజాకారంబు మఱుఁగు [10]పఱుపం దురంగిరూపంబు దాల్చి యొక్క వివిక్తప్రదే
శంబునం బతిసమాగమంబుఁ గోఱుచుఁ దదీయధ్యానపరవశయై యుండె. నంత
నక్కడ.

179


ఛాయాదేవియందు సౌవర్ణశనైశ్చరతపతులు పుట్టినప్రకారము

సీ.

ఛాయ సంజ్ఞాదేవిచందంబునన సూర్యునందు శుశ్రూషణం బాచరించు
చుండంగ నతఁడును నొం డెఱుంగక యనురాగవిహారైకరతి దలిర్ప
సౌవర్ణుఁడును శనైశ్చరుఁడును దపతినా బరగు కన్యయు జనించిరి క్రమమున
నయ్యింతి దనపాపలందు మిక్కిలి కూర్మి బెలయ సంజ్ఞాదేవిబిడ్డ లయిన

  1. కనఁగన నెల్ల ప్రొద్దు గొని కాలెడు (పూ.ము.)
  2. భామం
  3. తనపతివేఁడిమికిఁ బరి
  4. మఱచైనను
  5. నెరిపికొఱలుమి
  6. దనవి, శ్రాంతి దలఁచు కాంతయందు సనునె సుఖంబుల్.
  7. పాలికోయమ్మ
  8. కౌఁగలించి
  9. డంగలింప
  10. పడం