పుట:హరివంశము.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము ఆ.1

21


[1]దీప్తిమంతుండు గాలవుండు నీయేడ్వురు మహాముని[2]పదంబున వెలుంగుదురు.
పరీవానుండన తురీవానుండు సమ్మతుండు ధృతిమంతుండు వసుండు వరిష్ణుండు
నాథుండు ధృష్ణుండు వాసుండు సుపరేషుండు వృష్ణి సుమతి మొదలుగా మనుత
నయులు మనుజవిభులు గాఁగలరు. మఱియు దక్షదౌహిత్రులు నలువురు మేరు
సవర్ణు లయి సావర్ణ్యులనం బరగి యాకనకశైలంబుతటంబునఁ దపోనిష్ఠనున్నవారు.
రుచిప్రజాపతిపుత్రుండు రౌద్యుండును భూతిసంభవుండు భౌత్యుండునుగా
ననాగతమనువు [3]లేడ్వురు వీరలయందును సపరలు సురేంద్రులు మునులును
మనూద్భవులును వేఱువేఱ ఫురాణంబులం బరికీర్తితు లయి యుండుదురు.

163


సీ.

యుగచతుష్టయమును నొక్కటియై యేకసప్తతివారముల్ [4]సనియె నేని
మన్వంతరం బగు మన్వంతరంబున సలిలప్లవం బగు సలిలసంప్ల
వావసానము సృష్టి యంచితచరిత యీసరణిని యుగసహస్రంబు దెగిన
నబ్జాసనునకు దినాత్యయం బొదవు నత్తఱి సర్వభూతబృందములు నొక్క


తే.

పెట్ట యాదిత్యరశ్ములు వేల్చఁబ్రేలు, నట్టి బెడిదంబునకు నోర్వ కమరవరులు
మునులు నజుఁడు మున్నుగ మహిమూర్తి విష్ణు నుదరదేశంబు సొత్తురు బ్రదుకు గోరి.

164


వ.

ఇప్పుడు చెప్పంబడ్డ యీ ప్రపంచవర్తనం బంతముం గల్పంబులీలలం దెల్లను సాధా
రణంబైనవిధంబు నీ వడిగినయఖిలమన్వంతరంబులు సంక్షేపరూపంబున నీ కెఱిం
గించితి. నేతదీయ[5]విస్తరకథనంబు వర్షశతంబునకైన నశక్యవిధానం బని యుపన్య
సించి వైశంపాయనుం డన్నరనాయకుతో మఱియు ని ట్లనియె.

165


తరువోజ.

ఈవిశ్వమును సృజియింపంగఁ గర్త యీశ్వరుఁ డాద్యుఁ డహేతుఁ డక్షరుఁడు
గోవిందుఁ డనఘ యేకులమునం దాత్మ గోరి యుద్భవమయ్యెఁ గువలయం బలర
నావృష్ణిభూవరాన్వయము గీర్తించు నిట్టి యీకథనంబునం దేను చెప్ప
వైవస్వతుం డిప్డు వర్తిల్లు మనువువంశంబు వినుము భవ్యముగాన తొలుత.

166


క.

తనహృదయేశ్వరు గశ్యపు, ననుకూలప్రీతిఁ గొలిచి యదితి యతనిపా
వనతేజంబునఁ దాలిచె, దనయుం జూలుగ సహస్రధాము మహాత్మున్.

167


క.

ఆచందంబున నుండి వి, రోచనుఁ డాత్మీయతిగ్మరుచిఁ దల్లితనూ
గోచరకాంతి యఖిలమును, వే చెన్నఱఁ జేసెఁ జిత్రవిభవస్ఫూర్తిన్.

168


వ.

కశ్యపసంయమియు నయ్యతివం జూచి యవ్విధం బెఱుంగమింజేసి నీయుదరంబు
లోని [6]గర్భాండం బమృతంబు గావలె నని పలికె. నది గారణంబుగా మార్తాండుం
డను పేర నుదయించి యాదిత్యుం డత్యుగ్రతేజంబున జగత్త్రయంబునకు నధికసం
తాపంబు సేయుచుండె. నతనికిఁ ద్వష్టకూఁతురు సంజ్ఞాదేవి దేవియై యసాధా
రణం బగుసౌకుమార్యంబు గలయది గావున.

169
  1. దీప్త
  2. పదవి
  3. లార్వురు
  4. సనినయేని, సనినమనువు నంతరం బయిదు మన్వంతరాంతరమున
  5. కథావిస్తరంబు
  6. 'నఖిల్వయా మృతోండస్థ ఇతి...' 1-9-5 పాఠాంతరములు చూ.