పుట:హరివంశము.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 1

23


తే.

మువ్వురను గేరడము సేయ నవ్విధంబు, [1]సైపలేక యొకప్పుడు శమనుఁ డలిగి
చరణ మమ్మాఱుదల్లిపైఁ జూఁచెఁ దన్న, దాని కాయమ [2]కోపసంతాప [3]మెసఁగ.

180


క.

జనని యనక యిట్లెంతయు, నను [4]లంకించి తటుగావునం బదము మహిం
దునిసిపడుఁ గాత యని పెల్చ, న శపియించుటయు వెఱచి జముఁ డాతురుఁడై.

181


వ.

తండ్రిపాలి కరిగి ప్రణతి యొనర్చి తనయపచారంబు తల్లి కోపించి యిచ్చిన
శాపంబును నెఱింగించి.

182


ఉ.

ఎందఱు గల్గినం బ్రజలం [5]కేకవిధం బగులాలనంబు సే
యం దగరే సవిత్రులు మదంబ [6]మమున్ ముగురన్ సహింప దే
చందమొ పిన్నవారలకుఁ జాలఁగఁ బక్షముసేయ దీనికిన్
డెందములోనఁ దాలిమి ఘటింపక యే నిటు తప్పుసేసితిన్.

183


తే.

[7]బాల్యమున నైన నజ్ఞానభంగి నైన, [8]నైన దీని సహించి శాపానుభవము
దగులకుండగఁ జేయవే జగదధీశ, యనినఁ గరుణించి కమలాప్తుఁ డతనితోడ.

184


క.

వినయజ్ఞుఁడు ధార్మికుఁ డితఁ, డనఁ బరగిన నీవు నిట్టు లగుట యరిది యి
ప్పనికి నిమిత్తం [9]బేమో, యనఘా కలుగంగఁ [10]2జలు నాత్మఁ దలంపన్.

185


వ.

అది యట్లుండె. మాతృవాక్యం బమోఘంబు గావున నొక్కతెఱంగు సేసెదం
క్రిములు భవచ్చరణమాంసంబు ధరణిపయిం దొరిఁగింపఁ గలయవి యంతశాప
ఫలం బనుభూతం[11]బ యగు నని పలికి ఛాయాదేవిం జూచి నీవు సర్వసంతతి
యంచును సదృశవాత్సల్యను గావు, గామికిఁ గతం బేమి యని యడిగిన నది
యేమే నుత్తరం బీబోయినం గనలి యినుండు నిజంబు చెప్పుము చెప్పకున్న
నిన్నుఁ గఠోరశాపానలంబు పాల్పడుతు ననుటఁయు.

186


ఆ.

సంజ్ఞ సనిన తెఱఁగు సకలంబుఁ జెప్పె న, త్తెఱవ యతఁడు రోషదీప్యమానుఁ
డగుచు విశ్వ[12]1కర్ము నావాసమునకు నేఁ, గుటయు నమ్మహాత్ముకోప మెఱిఁగి.

187


వ.

అతఁడుం దనకూఁతురు మగిడి మగనిపాలికిం బోవమియు నాత్మదృష్టిం [13]దెలిసి
యల్లునిం బ్రియవినయసంభావనంబుల ననునయించి ప్రసన్నుం గావించి.

188


శా.

నీతేజం బతితీవ్రమై పరఁగుట న్నిక్కంబు సైరింపలే
కాతంకంబునఁ బొంది సంజ్ఞ భవదీయాకార[14]శాంతత్వముల్
జేతోవృత్తమునందుఁ గోరుచుఁ దపశ్శీలాత్మయై యున్న దీ
వాతన్విన్ జరితార్థఁ జేయఁదగదే యాతానుకూలంబుగన్.

189


మ.

భవదీయం బగుదివ్యయోగము గణింపన్ శక్యమే యద్భుతం
బవికారం బది చెప్పనేల నను నీ వాజ్ఞాపనం బిప్డు నే

  1. నాఁపఁగా లేక శమరుఁ డొకప్పు
  2. రోష
  3. మడర
  4. భంగించి
  5. కేకప్రియంబున బుజ్జవంబు
  6. యు మమ్మును ముగ్గురన్న వే; య మమ్మువురన్.
  7. బాల్యమందును
  8. నయ్యె నిది దీని సైఁచి
  9. బేమే ననఘా
  10. బోలు
  11. బగు
  12. కర్మయా
  13. గని
  14. కాంత