పుట:హరివంశము.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

హరివంశము


తే.

గాంచి మిథునధర్మంబు నిర్మించెఁ దత్ప్ర, ధానసంప్రయోజనకారి [1]దక్షతకును
జనికి సంకల్పదర్శనస్పర్శనముల, తొల్లి హేతువు లై చెల్లు దురితదూర.

72


వ.

ఆదక్షప్రజాపతికి వీరణపుత్రి యైన యసిక్నియందుఁ బుత్రసహస్రపంచకంబు వుట్టి
తండ్రిపనుపున భూతసృష్టి సేయ నుత్సహించునెడ నారదుండు సనుదెంచి.

73


ఉ.

బాలురు మీర లీధరణిభాగము క్రిందును మీఁదు దిక్కులున్
మూలలు నేంత యక్కొలఁది ముందఱి నిక్క మెఱింగికాక యు
క్కీలయి యిట్లు సృష్టిపనికిం దమకింపఁగఁ జన్నె యన్న వా
రోలిన యన్నివంకలకు నొక్కట నారయ నేఁగి రందఱున్.

74


క.

అమ్మెయిఁ జని యొకఁడైనన్, గ్రమ్మఱఁ జనుదేఁడ తత్ప్రకారంబున కు
ల్ల మ్మెరి[2]యఁగ నాదక్షుఁడు, క్రమ్మలు నాత్మజసహస్రకముఁ బుట్టించెన్.

75


వ.

వారు ముందఱివారియట్ల ప్రజల సృజియింపం దొడంగినఁ దొంటిచందంబున
నారదుం డరుగుదెంచి పలికిన.

76


తే.

ఇయ్యకొని లెస్సపని సెప్పె నిమ్మునీంద్రుఁ
డాదిఁ జన్న[3]వారలక్రమ మరయవలదె
యనుచు [4]నన్నిదిక్కులకు నత్యాదరమునఁ
బోయి యా[5]పోకలన డిందిపోయి రనఘ.

77


క.

[6]అది గతముగ భ్రాత సనిన, పదవి యరయఁ బోక సనదు భ్రాతక యని చె
ప్పుదు రాద్యు లవ్విధమున, వదలి చనినయాత్మజులకు వనరుచు మఱియున్.

78


వ.

దక్షుండు నిజపత్నియం దఱువండ్రు కూఁతులం గని ధర్మునకుం బదుండ్రను
గశ్యపునకుం [7]బదుమువ్వురను జంద్రునకు నిరువదియేడ్వుర నరిష్టనేమికి నలువు
రను గృశాశ్వునకు బహుపుత్రునకు నంగిరసునకు వేర్వేఱ నిద్దఱిద్దఱ నిచ్చె.
వారివలన వసురుద్రాదిత్యవిశ్వసాధ్యాదిదేవతలుపు దైత్యదానవయక్షరాక్షస
గంధర్వాప్సరోవిహంగ[8]భుజంగమప్రముఖులు బ్రభవించిరి. మఱియు గో
గజాశ్వ[9]ఖరోష్ట్రసింహశార్ధూలాద్యఖిలక్షుద్రజంతువులును జనియించె. వృక్ష
తృణలతాగుల్మాదులు నుద్భవించె. నందుఁ గశ్యపభార్య యైన దితిదేవి హిరణ్య
కశిపు హిరణ్యాక్షులం గనియెం. దత్సంతానం బపరిమేయం బై యదితి సంతతి
యైన యాదిత్యులతో విగ్రహించె. నట్టి విగ్రహంబున.

79


ఇంద్రుఁడు వజ్రాయుధముచేత దితిగర్భంబు ఛేదించిన ప్రకారము

మ.

అమరశ్రేణికి దైత్యసంతతికి నన్యోన్యాహవం బుద్ధత
క్రమరోషంబున నైన నందు సురవర్గం బేచి యవ్వైరిసం

  1. దక్షుఁ డొకఁడ
  2. యంగా దక్షుఁడు
  3. వారిక్రమంబు నరయ
  4. నట్టి
  5. పోకల నడంగి
  6. అది గతముగ భ్రాత చనిన పదవి యరయఁ బోక సనును భ్రాతకు నని.
  7. పదమువ్వురు
  8. భుజంగ
  9. ఖరతురగ