పుట:హరివంశము.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ.1

9


ఉ.

ధర్మువు దప్పి తాపసమతంబున కంకిలిపొ టొన్పఁ గ్రో
ధోర్మిహతాత్ములై తపసు లొక్కట నాతని [1]దక్షిణంపుఁ గే
ల్నిర్మథనంబు సేసిన జనించెఁ బృథుం డనురా జతండు స
త్కర్మధురీణుఁ డై నిలిపే ధార్మికసేవిత మైనమార్గమున్.

63


క.

అంతియ కాదు వసుంధర, యెంతయు గోరూపఁ జేసి యిచ్చెఁ గుశలుఁ డై
సంతతబహువస్తునివహ, మెంత వలచి రెవ్వ రంత యేర్పడఁ గురియన్.

64


వ.

అతనికి హవిర్ధాన యనుమానినికి శిఖండిహవిర్ధానులు జనియించిరి. శిఖండికి ధిషణ
యను తెఱవకుఁ బ్రాచీనబర్హియు శుక్లుండును గయుండును గృష్ణుండును నధ్వ
రుండును నజినుండును నను నార్వురు వొడమిరి. ప్రాచీనబర్హికి సముద్రపుత్రి
యైన సవర్ణయందు బ్రచేతసు లనువారు పదుండ్రు ప్రభవించి పదివేలవర్షంబులు
ఘోరతపంబు సేసి సోమకన్యక యగు మారిషం దమకు ధర్మపత్నిఁగా వరియించి
యయ్యింతియందు.

65


క.

దాక్షిణ్యధనునిఁ గాంచిరి, దక్షు నశేషక్రియైకదక్షుఁ బ్రభుఁ బ్రజా
ధ్యక్షుని నసదృశతేజుని, సాక్షాత్పరమేష్ఠిఁ బరమసంయమశీలున్.

66


వ.

అని చెప్పిన విని జనమేజయుం డతని కి ట్లనియె.

67


తే.

[2]ఆయజునికాలిపెనువ్రేలియందుఁ బుట్టె, దక్షుఁ డన వింటిఁ [3]దొంటికథాప్రసక్తి
నిపుడు ప్రాచేతసుం డనియెదు మునీంద్ర, యివ్విధం బేమి దెలియంగ నెఱుఁగవలయు.

68


వ.

సోమదౌహిత్రుం డైన యతండ యా సోమునికి మాము యెట్లయ్యె నని యడిగిన
వైశంపాయనుం డిట్లనియె.

69


మ.

విను సర్గంబు లయంబు భూతముల కుర్వీనాథ నిత్యంబు లెం
దును జన్మింతురు దక్షుఁ డాదియగునాద్యుల్ సర్వకల్పంబులన్
జనికిం గారణముల్ పృథగ్విధములై సంధిల్లు లే దెవ్విధం
బున నూహింపఁగఁ బిన్న పెద్ద యగుచొప్పు న్వావియున్ వారికిన్.

70


ఉ.

గౌరవలాఘవంబులకుఁ గారణ మిందఱకున్ దపస్సమా
చారము తారతమ్యము నిజం బిది జన్మగురుత్వహీనతల్
గోరి గణింప రివ్విధి యుకుంఠితబుద్ధి నెఱుంగు పుణ్యుఁ డిం
పారఁగఁ బొందుఁ గాంక్షిత[4]సుఖాగమమున్ బరలోకభద్రమున్.

71


సీ.

తొలితొలి సృష్టికిం దొడఁగి యంబుజసూతి దలపోయ నాతనితలఁపునందు
మునిదేవదానవమనుజాదిభూతంబు లొక్కట జనియించి యక్కజముగ
నవి యెన్నియును గల్గె నన్నియ యై యుండెఁ గాని వర్ధిల్లుట గలుగదయ్యె
నివ్విధం బటు సూచి యించుక చింతించి భూతవృద్ధికి హేతుభూత మొకటి

  1. దత్క్షణంబ మే, న్నిర్మ
  2. అజునికుడికాలిపెనువ్రేలి
  3. దొలుత
  4. శుభా