పుట:హరివంశము.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము ఆ.1.

11


ఘములో ముఖ్యులఁ బల్వురం దునుమ శోకం బంది దైతేయమా
త మనోవల్లభుఁ గశ్యపుం బ్రకటతాత్పర్యంబునం గొల్చినన్.

80


క.

ఆతడు ప్రసన్నుఁ డై య, న్నాతిన్ వర మడుగు మనిన నాకేశు ననిన్
ఘాతింపఁగ నోపెడుసుతు, నాతతబలు నవ్వరాంగి యర్థించుటయున్.

81


తే.

అమ్మహాత్ముఁ డాయమతోడ సబల నీవు, శుచిత నెప్పుడు నేమఱ కచలవృత్తిఁ
దగిలి నూఱబ్దములు చూలు దాల్పనోపు, దేని నట్టిపుత్రుఁడు జనియించు ననిన.

82


వ.

అయ్యుగ్మలి యయ్యుగ్రవృత్తంబు నడప నొడంబడియెం. గశ్యపమునియు గర్భ
ప్రదానంబు సేసి తపోవనంబున కరిగె. నమ్మగుప నిత్యంబునుగాఁ ద్రికాల
స్నానంబును వివిధోపవాసవ్రతంబులుం బూని శుచియై యుండె. నంతఁ దదంతరా
యా[1] పేక్షుండై సహస్రాక్షుండు సనుదెంచి నమస్కరించి తల్లీ నీవు వ్రతస్థితవై
యునికి యెఱింగి శుశ్రూష యాచరింప వచ్చితి ననిన నమ్ముగ్ధ సంతసిల్లి.

83


మ.

తనయా [2]యెంతయు మేలు సేసి తిటు మత్సామీప్యసంసేవివై
యనురూపస్థితి నుండు మబ్దశతపర్యాప్తి జనింపంగ నీ
యనుఁగుందమ్మునిఁ జూచు నుత్సవము నీ కబ్బున్ జగం బంతయున్
విను మీ రిద్దఱుఁ గూడి యేలుఁడు కడున్ విఖ్యాతి సంధిల్లఁగన్.

84


క.

అనియె నతండును దత్సే, వనతాత్పర్యంబు [3]తగ నెపం బిడి యే ప్రొ
ద్దును [4]నెడమడు గగుమదితో, ననువర్తింపంగఁ గించిదవశిష్టముగాన్.

85


వ.

సంవత్సరశతం బతిక్రాంతం బైన నొక్కనాఁ డమ్ముదిత పాదశౌచంబు సేయమఱచి
నిద్రిత యైన నది రంధ్రంబుగాఁ దదీయోదరంబు సొచ్చి జంభారి దంభోళిం గొని
తద్దర్భం బేడువ్రయ్యలుగా వ్రేయ నయ్యర్భకుండు రోదనంబు సేసిన.

86


క.

మా రుద యని పలుకుచు నతి, దారుణరోషంబుతోడఁ దచ్ఛకలము ల
వ్వీరుఁ డొకటొకటి యేడే, డై రూపఱ నడిచె నంత నసభ్యుత్థిత యై.

87


క.

అసురజనని కడునార్తిని, వసమఱి యిటు సేయఁదగునె వాసవ యనఁగాఁ
ద్రసదంతరంగుఁ డగుచును, వెస వెలువడి విబుధవిభుఁడు వినతాంగుం డై.

88


చ.

అడుగులయందు శౌచవిధి యాత్మ నొనర్పఁ దలంప కీవు కా
ల్గడఁ దలయంపిగా నిగుర గైగొన నేనిది యంతరంబుగాఁ
గడఁగి మదంతహేతు వగుగర్భము నొంచితి దీనిఁ దప్పుగాఁ
దడవక సైఁపఁగా వలయుఁ దల్లి నినుం గొనియాడు లోకముల్.

89


చ.

అనవుడు నింద్రుతో ననియె నమ్మునిపత్ని యొకింతయేనిఁ గీ
డన వశమే భవచ్చరిత మంతయు లెస్సయ కాక యింక నా

  1. పేక్షి యైన
  2. యెంతటి
  3. దగు
  4. నెడ గోరినమతితో, ననువర్తింపంగ నుండె.