పుట:హరివంశము.pdf/557

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము. ఆ. 10.

509

వ. వేఱొక్కరథం బెక్కి ముక్కంటినెచ్చెలి చిచ్చఱపిడుగులకు సంగడంబగు కడింది
     యమ్ముల నమ్మహాసత్త్వు నేయుటయు నతండు పర్వతప్రమాణం బగుపాషాణం
     బొక్క టెత్తి యహితుపై వైచిన.146
మ. గద సేతం గొని శీఘ్రలంఘనకళాకల్పజ్ఞుడై పాసె న
     ర్థదుఁ డాఱాయి హయధ్వజప్రతతితోఁ దత్స్యందనం బంతయుం
     జదియం దీవ్రరయంబునం బడియె యక్షశ్రేష్ఠుఁ డొండొక్కచోఁ
     బదిలంబారఁగ నిల్చి పిల్చె ననికిం బ్రత్యర్థి [1]నన్వర్థియై.147
క. దితిసుతుఁడును వేఱొకప, ర్వతశిఖరము బెఱికికొని జవంబున నలకా
     పతిపైఁ బఱతెంచిన గద, నతఁ డతనియురంబు వైచె నతిరౌద్రముగన్.148
క. [2]వ్రేటును సరకుగొనక గిరి, కూటంబునఁ బ్రహతుఁ జేసె గుహ్యకవిభు న
     మ్మేటిమగఁ డతఁడు మూర్ఛా, [3]స్ఫోటితచైతన్యుఁడై వసుంధరఁ బడియెన్.149
వ. ఆలోన నతిరయంబునం దదాప్తు లగు యత రాక్షసవీరు లందఱుం బఱతెంచి పరి
     వేష్టించి యతని సహితుని కగపడకుండం బరిరక్షణం బొనర్చి రాక్షణంబున నేకపింగ
     ళుండు జడను దొఱుంగి లేచి నిలిచి నింగియు దెసలు నద్రువ నార్చె నిట్లు మహా
     చలశృంగతాడితాంగుం డయ్యును భగ్నంబు నొందని యతని నవధ్యుంగా
     నెఱింగి దైత్యు లెవ్వరుం గోల్తలసేయక తొలంగినం గని పురికొల్పికొని కాల
     నేమి సునేమి మహానేమినామంబులం గల యనుచరులతోడం గూడ ననుహ్లా
     దుండు దలపడినం గుబేరుని సైనికుల మార్కొని రయ్యిరువాఁగునకు శక్తిగదా
     ముసలప్రాసపరిఘపరశ్వథాదుల గిరిశిఖరశిలావృక్షకాష్ఠంబుల బాహుముష్టినఖ
     దంతంబుల నతిఘోరంబు లగు సంప్రహారంబులు ప్రవర్తిల్లె నప్పుడు.150
చ. గదగొని రాజరా జడరెఁ గ్రమ్మఱ శాత్రవుమీఁద నాతఁడున్
     గదగొని తీవ్రుఁడై యెదురుగా నడతెంచె నతండు వ్రేసె నా
     గద నది నుగ్గుగా నడచె గ్రక్కున నాత్మగదాహతిం బలం
     బొదవఁగ దానవేంద్రుఁడు సురోత్కర మొక్కట పిచ్చలింపఁగాన్.151
వ. కిన్నరేశ్వరుం డొక్కగదఁ గొని నిలిచిన ననుహ్లాదుండు చేతిగద యురివి కొండ
     చఱి వ్రయ్యవాపి పుచ్చుకొని దీనం బగతుం బొరివుత్తు ననుచుం బ్రళయపర్వ
     తాపహారి యగుమహాసమీరుండపోలె దారుణరయంబునం బఱతేరం
     గనుంగొని.152
క. దనుజులకు మేలుచేయును, ననిమిషులకుఁ గీడుపాటు నగుచుండుట నె
     మ్మనమున నూహించి తలఁకి, ధనదుండు దొలంగె నాప్తతతియుం దానున్. 153
సీ. జితకాశి యగు విప్రచిత్తి పశ్చిమదిశానాథునిఁ దీవ్రబాణములఁ బొదివి
     ప్రళయకాలమునాఁటి భానుదీప్తులుఁబోలె [4]సర్వసత్వాళి శోషణముఁ జేయ

  1. నత్యర్థియై
  2. వాటు
  3. చ్ఛోటిత
  4. సర్వావరోధనసమము