418
హరివంశము
వ. అవ్విధంబున బ్రద్యుమ్నుసూనువృత్తాంతం బనుసంధించుట యయ్యుడుఁ బొమ్మని
తాను నిజేచ్ఛం జనియెఁ జిత్రరేఖయు నదృశ్యమూర్తి యై వాసుదేవు పెద్ద
నగరును బ్రద్యుమ్నుమందిరమును నరసి [1]యావల ననిరుద్థుగేహంబు గాంచి
యందు మనోహరస్థలంబున.174
చిత్రరేఖ యనిరుద్ధుమందిరంబు సొచ్చి యతనిం గొనివచ్చుట
క. పసిఁడికోరల నించి యింపెసఁగ మధువుఁ, గ్రోలుచునుఁ జుట్టునతివలు గ్రాలునడుమ
నమరుపిడిపిండులోని మహాగజేంద్రు, కాంతి నమరుకుమారు నంతంతఁ గనియె.175
వ. కని తదతీయభావం బుపలక్షించి యాత్మగతంబున.176
చ. సరసతయొప్పఁ బ్రోడ లగుచామలు పాటలు నాటలుం గరం
బరుదుగ విస్తరించుచుఁ బ్రియంబులు సూపఁగ దీన నేమిటం
బొరయమి గానరా నొక యపూర్వపుఁ జందముతో నృపాత్మజుం
డెరవయి యున్నవాఁ డకట యేమిగతం బగు నొక్కొ దీనికిన్.177
సీ. బలిమిం గొల్వున నవ్వుదళుకొత్తినను మొగం బెల్లఁ దానై యున్న వెల్లఁదనము
ధీరతఁ దెచ్చి పొందించిన పలుకులయందు గద్గదిక వాయంగ లేదు
గరువంపుజూపులఁ బురిగొనియిన్నను రాగ మేతెరువున రాదు సేరఁ
జేతులు వేడుకచేఁతలకై చక్కఁ బచరించినను జక్కఁబడదు చేష్ట
తే. యితనిచిత్త మెవ్వతెయేనిఁ జతురయొకతె, గొన్నయది దైత్యనాథునికూఁతు నితఁడు
బొందినటు లీతనికి నింపొందఁ గలుగఁ, బోలు [2]దైవికమయ్యు నప్పొలఁతియందు.178
చ. అగు ననుమాన మేమిటికి నమ్మదిరేక్షణదక్క నొండులే
మగువలు నీయుదారు నసమాానమనఃపరివీడ నొందున
ట్లుగ నొనరింప శక్తలె త్రిలోచనదేవిప్రసాదసంపదల్
జగదభివంద్య లయ్యు సరసంబుగఁ బండె మదీయయత్నముల్.179
వ. ఇప్పు డితనితోడ సంభాషింపవలయు నవ్విధంబునకు ననురూపంబుగా వివిక్తంబు
గావించెద నని తలంచి యన్నాతి నారదదత్త మైన విద్య నక్కడి జనంబు నెల్ల
సమ్మోహితంబుఁ జేసి చేరం జని పొడసూపి నిలిచి విరచితాంజలి యై యి ట్లనియె.180
సీ. బలిదైత్యుపుత్రుండు బాణుండు నాఁగఁ బ్రఖ్యాతుఁ డాతనికి హిమాద్రికన్య
వరమునఁ బుట్టినయరిదికూఁతురు త్రిలోకైకసుందరి యుష యనుకుమారి
యప్పరమేశ్వరియానతి నిశ్చలనిద్ర యై యుండంగ నీవు దన్నుఁ
గలయంగఁ గలగని కామార్త యై తాల్మి గోల్పోయి నెవ్వగ కొలఁది మిగిలి
తే. చెఱిచి మఱచిన తెఱఁగునఁ జెయ్వులెల్ల, నెడల విడిచియున్నది బోటి యేను జిత్ర
రేఖ యనుదాన నినుం బ్రియలీలసుముఖుఁ, జేసి తోడ్కొనిపోవవచ్చితిఁ గుమార.181
క. నాచెలికత్తియరూపం, బాచతురాననుఁడుఁ జాలఁ డభివర్ణింపన్
గోచరయే యస్మాదృశ, వాచోయుక్తులకు నైన వలయుం దెలుపన్.182