Jump to content

పుట:హరివంశము.pdf/465

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 7.

417

     స్ఖలన మెఱుంగరు నన్నా, [1]కలఁకకు రానీకు నీవు గలఫల మతివా.163
క. దూతీముఖమున గరువము, ప్రీతియుఁ బొదలంగఁ గదియుఁ బ్రియము లరయఁ గా
     ర్యాతురతఁ దాన పైకొను, టే తెఱఁగునఁ గాదు సూడు మిది నీబుద్ధిన్.164
వ. దౌత్యంబు లాఁతివారిదెస నొక్కింత [2]యెగ్గయి తోఁచుం గాని తన ప్రాణంబు
     లతో సమానం బగు జనంబునందుఁ గేవల గౌరవంబునక యయ్యుండు నిన్నియు
     నీ యెఱుంగని భంగులే యనిన నయ్యంగన యింతయు నన నేల నన్ను నేలం
     బనిచెదవు గాదె వేగంబ సర్వశోభనంబులకు భోజనం బయ్యెదు గాక యొక్కింత
     ధైర్యం బవలంబింపు మని యూఱడించి యమ్మగువం గౌఁగిలించి యెప్పటియట్ల
     చెలికత్తియలం బరివేష్టించి యుండం బనిచి వీడ్కొని యంతరిక్షంబునకు నెగసి
     యంతర్ధానంబు నొంది.165
క. చెలువ మనోజవ గావునఁ, గళాంతరములోన సనియెఁ గంసరిపుని యు
     జ్జ్వలవైభవముల కెల్లను నెల వగు తద్ద్వారకాఖ్య నిరుపమపురికిన్.166
వ. చని తదీయసౌందర్యంబునకు మోదంబు నొందుచుం దన కార్యగతియం
     దొక్కింత చింతాకుల యై యుండ నంత నక్కడ నొక్కసలిలాశయంబున నున్న
     నారదుం గని చేర నరిగి ప్రణామంబు సేసిన నకండు దీవించి నవ్వుచు నవ్వెలంది
     నాగమనకారణం బడిగినఁ జేతులు మొగిచి.167
క. బాణసుతుకోరికయు రు, ద్రాణికృపాదానమును ముదంబున సుమనో
     బాణసుతుగుఱిచి తా న, క్షీణతఁ గనవచ్చుటయును జెప్పెఁ గ్రమమునన్.168
వ. చెప్పి మునీంద్రా యేను యదుకుమారునిం గొనిపోయిన నవశ్యంబు నెఱింగి
     బాణుండు సైరింపండు బాణపరాక్రమ మనిరుద్ధునకు భరం బై వచ్చు. మీరు
     మురాంతకునకు నివ్విధం బెఱుంగింప వలయు బలితనయ వసుదేవతనయులకుఁ
     గయ్యం బగు ననియుం గల దందు దైత్యారికి విజయం సిద్ధంబు మఱియొక్కటి
     యెఱింగించెద.169
చ, మనుమని నొక్కకాంతకయి మాయపుభంగిఁ దొలంగ దవ్వుగాఁ
     గొని యట యేను పోవుట ముకుందుఁ డెఱింగిన శాపవహ్నిచే
     నను నెటు నీఱుసేయునొ మనంబునఁ బెల్కుఱియున్నదాన స
     న్మునివర నీవు దోఁచితి మనోరథదేవతవై ప్రసన్నతన్.170
క. కావునఁ గృష్ణునిదేస భయ, మేవిధమునఁ బొందకుండ నీవలయుఁ గృపన్
     నీవరవు డుషాకన్యకు, దేవా యిట్లైన నెల్లదియు సిద్ధించున్.171
క. అనిన మునీశ్వరుఁ డయ్యం, గనఁ గనుఁగొని నీకు నఖలకార్యములకు సొ
     ధనముగ నిచ్చితిఁ దామసి, యను విద్య ప్రియంబు నొందు మంబుజవదనా.172
క. నీ వనిరుద్ధుని నట గొని, పోవఁగ సురరిపునితోడిపోరు గలుగు నే
     నావేళ నరుగుదెంచి ర, ణావష్టంభంబు సూతు ఈ [3]నాదటవోవన్.173

  1. మ్మా, కలకగునే నీకు రాకుండగలఫల మతివా.
  2. నెగ్గంబై
  3. ఆరట