పుట:హరివంశము.pdf/412

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

364

హరివంశము

     ఋజుమార్గం బగుశిష్టవర్గమునకు హృద్యంబుగాఁ జూపిన
     ట్టిజగద్దేశికుఁ [1]గానఁగాఁ జనుటకంటెం గల్గునే కార్యముల్.186
మ. స్థితికాలంబున దుగ్ధసాగరములో దీపాహిభోగంబు భా
     సితతల్పంబుగ యోగసుప్తిరతుఁ డై శ్రీదేవిపాచాంబుజ
     ద్వితయం బంకతలంబుపై నిడి ప్రమోదింపం బ్రమోదించున
     చ్యుతుఁ డీయుర్వికి వచ్చినాఁడు సనదే చూడంగఁ గ్రీడానరున్.187
మ. లయవేళం జతురబ్ధులన్ భువనసంప్లావంబు గావించి యెం
     తయు నాత్మోదరగుప్తమై యొదుఁగఁగాఁ దా నిచ్చ మాయావటా
     శ్రయకేళిం బసిపాపఁ డై యలరి శశ్వత్సంయమిధ్యాసస
     త్క్రియలం బొందెడు దేవు బాహ్యకరణిన్ దృష్టింపఁగా నొప్పదే.188
మ. భృగువంశోద్భవుఁ డైనయాదిమునికిం బ్రేమ న్మహా[2]కుక్షిలో
     జగదండం బఖిలంబు నిచ్చి మగుడ సర్వంబు నవ్విప్రుఁడుం
     దగఁ జూడంగ [3]వెలార్చి సృష్టిరచనాతంత్రంబు యంత్రింప బు
     ద్ధిగరిష్ఠాత్ములఁ బంచె నేవరదుఁ డాదేవేశునిం జూచెదన్.189
శా. వేదాధ్యాయులు గానలేరు నియమా[4]వేశవ్రతు ల్గానలే
     ర్వేదాంతజ్ఞులు గానలేరు బహుసంవిత్తర్కకార్కశ్యసం
     వాదుల్ గానఁగలేరు భక్తి వెలిగా భక్త్యేకసం[5]ప్రాప్తునే
     మాదేవున్ హరుఁ గానఁబోయెదము భాగ్యారంభ మెట్లో తుదిన్.190
వ. ఇదె యస్మదీయం బగుమనోవ్యవసాయం బిమ్మధ్యరాత్రంబు మాబోఁటివారు
     మలఁగెడుకాలంబు నీవు మనుష్యుండ విచ్చోట నొక్కండవు నుండుట కార్యంబు
     గాదు వేఱొక్కయెడకుఁ దొలంగి పొమ్ము మాకు నొక్కింత నియమంబు గల
     దని పలికి యమ్మహాపిశాచుండు పూర్వకల్పితం బైనమాంసం బెంతయేనియు
     భక్షించి బహుళం బగురక్తంబు గ్రోలి వెనుక వచ్చిన పిశాచగణంబులం బోవం
     బనిచి వనజోదరునకుఁ జేరువ యగుతత్ప్రదేశంబునన సమతలంబునం గుశసంచ
     యం బాసనంబుగా నమర్చి కూర్చుండి తనకేల నున్నప్రేవులు బర్యంకంబు దృఢం
     బుగా నమర్చి.191

ఘంటాకర్ణుఁడు శ్రీకృష్ణు నుద్దేశించి నిజనియమం బనుష్ఠించుట

క. పెక్కుభవంబులఁ గూర్చిన, నిక్కపుఁబుణ్యమున కపుడు నిర్భరపాకం
     బెక్కినభక్తిని హరిపైఁ, జిక్కినచిత్తంబు దనకుఁ జేదోడుపడన్.192
వ. కృతాంజలియై సర్వాంగంబులు పులక సంఫుల్లంబులుగా నానందజలకణకలితంబు
     లగునయనంబు లెలరార ఉద్[6]గాత్రం బగు గాత్రంబుతోడం దొలుత భగవన్మం
     త్రంబు సమగ్రతంత్రంబుగా గదియించి యనంతరంబ యి ట్లని యనుస్మరించె.193

  1. గృష్ణు నీశ్వరునికంటెన్
  2. మూర్తితో
  3. వెలార్చె నట్టి
  4. వేశోద్యతు
  5. ప్రార్థ్యు
  6. ంగ్రాంతం బగు