పుట:హరివంశము.pdf/413

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 5.

365

సీ. సర్వజగత్కర్మసాక్షి నక్షరుఁ బుండరీకాక్షు గోవిందు శ్రీకళత్రు
     వాసుదేవుని భక్తవత్సలు శ్రీవత్సవక్షు నధోక్షజు వనజనాభు
     నే నిన్నుఁ గీర్తింతు నిట్టికీర్తనమున వగరద ముకుంద నిర్వాణరూప
     నాచిత్త మేకీడునకుఁ జే వలంతిగా కేప్రొద్దు నీయంద యెలయుఁగాత
తే. నీచకర్మదూషిత యిప్పిశాచవీర, తనువు దైత్యారి నీచక్రధారఁ ద్రెస్సి
     వెండియును బుట్టువుల నొందకుండవలయు, బ్రహ్మభూయంబు నా కిమ్ము పరమపురుష.194
మ. జననంబుల్ మఱి కల్గెనేనియును నాజన్మంబులం దెల్ల
     మన మీశాన భవన్మనోజ్ఞపదపద్మధ్యానతాత్పర్యముం
     గనుఁగా కంచితకల్పభూరుహము నీకారుణ్య మానమ్రులం
     దనఁగా విందు మదీయవాంఛ దగుఁ జేయన్ దేవ నీ కెమ్మెయిన్.195
చ. కుటిలపిశాచజన్ముఁ డతిఘోరచరిత్రుఁడు వీని కేల యిం
     తటఁ గరుణింపఁ నంచుఁ గృపదప్పకుమీ నినుఁ దప్ప నొండు ది
     క్కట నిట కోర నంత్యదశయందును నామది యట్ల చేయుమీ
     పటుతరకాలపాశముల పాల్పడఁజాలఁ జుమీ జనార్దనా.196
సీ. ఎన్నిజన్మములనో యియ్యింద్రియంబులు నాచేతఁ జిక్కక నీచవిధికిఁ
     దిగువంగఁ దిగువంగఁ దగిలి పోయినమానసముచెయ్ది నిప్పాపజన్మ మొలసె
     నీజన్మమునయందు నివి గ్రమ్మఱఁగ గాసి[1]సేయఁగ నున్నవి జిక్కుపడిన
     నేమి సేసియుఁ గొఱయేమి పరద్రవ్యపరదారపరివాదపరిహరణము
తే. నాకు నీవిచ్చువరముగా నాథ వినుము, నాదుశ్రోత్రాదివర్గంబు నలిననాభ
     యంబరాదిభూతములయం [2]దదిమి యవియు, నిన్నుఁ గలపి న న్నానందనిష్ఠ మనుపు.197
తే. నీకు మ్రొక్కెద [3]నున్నిద్ర నీరజాక్ష, నీకు మ్రొక్కెద ధర్మప్రణీతదక్ష
     నీకు మ్రొక్కెద నిశ్ళోకనిగమరూప, నీకు మ్రొక్కెద నిర్వాణనిత్యదీప.198
వ. అని పలికి మహాభాగుం డగు నబ్భాగవతుండు.199
తే. బాహ్యగతి మాని మగిడినభావ మచ్యు, తైకసంశ్రయంబునఁ గంప మేది నిలిచి
     గాలి దాఁకనిదీవియకరణి వెలుఁగ, నుండెఁ బరమానుసంధానయుక్తిఁ దగిలి.200
వ. ఇత్తెఱంగున నుత్తమధ్యాననిష్ఠుం డైన యాగుణగరిష్ఠుని నిలుకడ యంతయుం
     జూచి సంతసిల్లి యుత్ఫుల్లవిలోచనుం డగుచుఁ బద్మలోచనుండు తనయాత్మగతం
     బున నతని సుకృతకారణంబులు దలపోసి వీఁడు ధననాథునకు ననుంగుబంటగుట
     నమ్మహాదేవసఖువలనం బరమజ్ఞానంబు వడసి పూర్వపుణ్యవాసనానురూపంబుగాఁ
     బొడమిన భక్తికిం బ్రోదిగా ననవరతంబును గృష్ణ కేశవ వాసుదేవ జనార్దనాది
     నామంబులు గీర్తించుచు మృగంబుల వధియించుతఱిఁ దన్మాంసఖాదనం బొన
     రించునెడఁ దదీయరుధిరపానంబు సేయునప్పుడు సర్వావస్థలయందును సమ

  1. సేయుచునున్నవి
  2. దరమియేయు
  3. నోకృష్ణ