పుట:హరివంశము.pdf/407

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 5.

359

వ. ఎగసి క్రమంబున సిద్ధవిద్యాధరసేవ్యంబు లగు మార్గంబుల ననర్గళప్రకారం బగు
     సంచారంబు గైకొని.148
సీ. తోరంపుటూర్పులతోడఁ బాతాళముఁ దాఁకంగ సాగరౌఘములు గలఁగ
     [1]వికటంపుటెఱకలవిసరున నుప్పొంగుతుప్పర డెందంబు దూ పడంగ
     బలితంపుజంఘల పెలుచనితాఁకున నమరయానములు తుత్తుమురు గాఁగ
     నుగ్రంపుఁజూపుల నొడలికెంపుల దిక్కు లన్నింట నెఱసంజ లావహింప
తే. బఱచునురవడిఁ బొడమునిబ్బరపుమ్రోఁత, కొండ[2]గొబలెల్లఁ జొచ్చి యొండొండ పెరుగఁ
     గమ్రతనుకాంతిపూరంబు గడలుకొనఁగ, హరి వహించి నభంబున గరుడుఁ డరిగె.149
శా. ఆదేవు న్గరుడాధిరోహణవిహారాభిన్నసద్భావు స
     ర్వాదిత్యోత్తమసంయమీప్రవరు లంతంతం గనుంగొంచు నా
     హ్లాదంబుల్ హృదయంబులం బొదల భవ్యస్తోత్రవాచాలు రై
     రోదస్యంతరమంతయు న్నినిచి రారూఢాత్మఘోషంబునన్.150
వ. వార లందఱు నతిభక్తిసంసక్తులై తన్ను ననువర్తింప నప్పుణ్యకీర్తనుం డటఁ జని
     తొల్లి నరనారాయణసమాహ్వయం బగు నాత్మీయమూర్తిద్వయంబునకు ననేక
     సహస్రసంవత్సరంబులు తపోనుష్ఠానంబునకు నధిష్ఠానం బై నిరంతరోత్తుంగ
     గంగాతరంగంబులం బొదలు శీకరంబులం బునరుక్తఫలోత్కరంబు లగు తరు
     నికరంబుల నలంకృతం బై వృత్రవధాదిపాతకంబులం బాపికొనం బాకశాసనా
     దులకును శరణ్యంబు లగు పుణ్యప్రదేశంబులు తనయంద తనరుటం ద్రిజగదేక
     పరాయణం బై బాదరాయణాదులు నాదరంబుతోడం జిరసమాహితబుద్ధు
     లగుచు సిద్ధులు గోరి నిలువం దగు విభవంబున నద్భుతం బై పద్మప్రభవాదులు
     వేదోక్తవిధానంబుల వివిధాధ్వరంబులు విదితంబులుగాఁ జెల్లించి యెల్లచోట్లను
     హాటకరత్నమయరూపంబు లగు యూపంబుల నలంకృతంబు గావింపం బొదలు
     పెంపున నకంపనకల్యాణం బై వెలసి నిఖిలపావనం బగు బదరీవనంబు ప్రవేశించి
     సాయాహ్నసమయంబునం దదీయమధ్యంబునందు.151
సీ. తరువిటపాసక్తధౌతవల్కలపఙ్క్తి కమనీయతోరణకల్పనముగ
     హూయమానంబు లై యొండొండ వెలిఁగెడు త్రేతాగ్ను లభినవదీపములుగ
     దుగ్ధపానంబులఁ ద్రుళ్లుపెయ్యనోరినురువులు సితపుష్పవిరచనలుగఁ
     గోరి నీడంబులు సేరెడిఖగములవాసితంబులు జయధ్వానములుగఁ
తే. దనసమాగమోత్సవమునఁ దగినశుభము, లప్రయత్నసిద్ధములుగ నతిశయిల్లు
     మునిజనాశ్రమరేఖ లవ్వనజనాభుఁ, డర్థిఁ దఱిసి యందొకరమ్యమైనచోట.152

  1. వికటంపుటెరకల విసరునుప్పొంగుడుబ్బున నబ్జభాండంబు బూరటిలఁగ
  2. గుహ