పుట:హరివంశము.pdf/382

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

334

హరివంశము

     మారుతుండు ని ట్లని పలికెఁ దదాదేశంబు పరిక్లేశక్షమత యిచ్చిన నే మింత కాలం
     బును శీలంబు గోలుపోక జీవంబులతోడ నుండి నేఁడు ధన్యత్వంబు నొందితి మని
     విన్నపంబు సేసిన.196
శా. ప్రేమోదాత్తము లైనతద్వచనముల్ పెంపారుసాకూతలీ
     లాముగ్ధం బగుచూడ్కితో బెరసి యుల్లాసంబు గావింప నా
     శ్రీమంతుండును దాని కియ్యకొని సస్నేహావలోకంబు వా
     క్యామోదంబున వెల్లిగొల్చి ప్రమసం బందించె నయ్యందఱన్.197
వ. ఇట్లు దేవకన్యలం గైకొని యనేకసంఖ్యలు గల రాక్షసకింకరుల రావించి మణి
     కనకరచనారుచినంబు శిబికాచయంబుల నయ్యింతులం దోడ్కొనితెర
     నాజ్ఞాపనంబు సేసి.198
ఉ. అమ్మణిపర్వతంబు గలయం జరియించి తదీయ [1]మైనశృం
     గమ్మొక టిద్ధకానననికాయముతో మృగపక్షిజాతిజా
     తములతో, జల[2]జ్ఝరవితానముతో వెసం ద్రుంచి తార్క్ష్యుపై
     నిమ్ముగణించి తాను [3]దగ నెక్కె సముత్సుకచిత్తవృత్తి యై.199
తే. భామినీసమన్వితుఁ డగు నాముకుందు, నమ్మహాశైలశిఖరంబు నచ్చెరువుగ
     మోచ నశ్రమముగఁ బక్షిముఖ్యుఁ డంబ, రమునఁ బవమానసమజవప్రౌఢి మెఱయ.200
వ. ఇవ్విధంబున.201
సీ. స్వామిచేతోవృత్తిసరణి యెఱింగి యవ్వైనతేయుఁడు హేమవర్ణలలిత
     పటుపక్షవిక్షేపభంగంబు లై గోత్ర[4]గురుశృంగములు రాలఁ జరణజాను
     లగ్నంబులై సముల్లసితాభ్రచయములు నలుదెసఁ దూల నున్మార్గలీలఁ
     జనఁ గ్రమంబున జనార్దనుఁడు మరుద్వసుతపనేందుసిద్ధసాధ్యప్రధాన
     భవ్యధామంబు లెల్ల నతిక్రమించి, సురవరులలోకములను జూచుచును వేడ్క
     నరిగి కనియె ననేకశతాశ్వమేధ, రమ్యగమ్యము నగు శతక్రతువునెలవు.202
వ. కని ప్రవేశించి వాహనంబు డిగ్గి శచీసమేతుం డైన యద్దేవునకు నమస్కరించి
     యదితీదేవికుండలంబు లిచ్చి తత్ప్రతిపూజితుం డై సముచితసంభాషణం బొనర్చెఁ
     బౌలోమియు సత్యభామయు నొండొరులం గౌఁగిలించుకొని.203
క. తగుమాటలఁ జిత్తంబులు, సిగురొత్తంగఁ గలసి మెలసి చెన్నగుగోష్ఠిన్
     సొగియించునెడ ముకుందుని, మగువకు శచి యిట్టు లనియె మంజులఫణితిన్.204
క. దేవీ నీహృదయేశుఁడు, దేవసమానుఁడు సమస్తదేవనివహవి
     ప్లావకుని నరకుఁ గూల్చి మ, హావిక్రమకేళి ద్రిజగదభయం బొసఁగెన్.205
వ. నీసౌభాగ్యం బనన్యదుర్లభసంభావనోపభోగ్యంబు నిన్నుఁ జూచి ప్రియంబు నొం
     దితి నీయభిమతం బొక్కటి గావింపఁ గోరెద ననుటయు నవ్వనజవదన వినమ్ర

  1. శృంగమోఘ మ్మగుదాన
  2. జ్వల
  3. వెస
  4. శిఖరంబులును దరుశ్రేణికలుకు