పుట:హరివంశము.pdf/381

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము .ఆ. 4.

333

     కస్తూరికాదులు [1]ననల్పంబు లిన్నియు దేవరకు సమర్పించితి మిట్టిసంపద
     యంతయు భవదీయవిచిత్రక్షాత్రధర్మంబునం జేరినయవి యాత్మీయంబుగాఁ
     జిత్తగింపు మాజ్ఞాకారు లగు మమ్ము ననుశాసించి యనుగ్రహింపు మనుటయు.186
క. వారలవిజ్ఞాపన మ, వ్వారిరుహోదరుఁడు విని ప్రవర్థితహర్షో
     దారహృదయుఁ డై యెంతయు, గారవమున నంతపట్టుఁ గైకొని వరుసన్.187
వ. ఆవస్తువులు ప్రత్యేకంబ పరీక్షించి యారాక్షసులచేతన నిజనగరంబునకుం గొని
     పోవ నుచితప్రయత్నంబునం బుచ్చి యవ్వారుణచ్ఛత్రంబు దాన కరంబునం దాల్చి.188
తే. కనకధారలు సోన లై కడలుకొనఁగ, నావిహంగమవరు నెక్కి యాక్షణంబ
     వినయమున నధికారులు గొలిచిపోవఁ, బోయె మణి శైలమునకుఁ బ్రభూతయశుఁడు.189

శ్రీకృష్ణుండు పదియాఱువేల నూర్గురు సురకన్యకలం గ్రహించుట

సీ. ఆపర్వతముచుట్టు నభిరామహేమతోరణపతాకావళుల్ ప్రజ్వరిల్ల
     లలితంబు లగుసౌధవలయంబు లుజ్జ్వలశంపాలతారమ్యశారదాభ్ర
     మండలంబులపోలె మహితంబులై యొప్పఁ గని తార్క్ష్యు డిగి చొచ్చి యనుపమాన
     కమనీయమూర్తులు గంధర్వనాథులకూఁతులు గన్యలు గుణసమగ్ర
తే. లసురపతి చేతఁ జెఱవడి యార్తితోడ, నేకవేణీధరలు నియతేంద్రియలును
     నై నిజాభిజాత్యముఁ గాచి యాత్మదర్శ, నంబ గోరుచుండఁగఁ బద్మనాభుఁ డచట.190
క. పదియాఱువేలనూర్వురఁ, బొదివినయెలజవ్వనములఁ బొలివోవక యిం
     పొదవెడువారిఁ గనియె న, మ్ముదితలు నద్దేవుదెస సముత్సుక లగుచున్.191
వ. మురహయగ్రీవనిసుందపూర్వకంబుగా నుర్వీసుతుండు [2]దగ్ధదోర్విభవుం డగుట
     యెఱింగినవారు గావున.192
తే. నిండు చందురు లొక్కట నెఱసి మెఱయు, కరణి నెమ్మోము లభినవకాంతి నలర
     నందఱును నెదురుగ వచ్చి యతనిచుట్టు, నిలిచి విరచితాంజలు లైరి లలితలీల.193
వ. వారలకుం గావలి యున్న వృద్ధకంచుకులు నంతంత మ్రొక్కి నిలిచి రంత నా
     కన్నియ లతని కి ట్లనిరి.194
క. సురకన్యల మే మసురే, శ్వరుచెఱ నిట్లుండి యధికసంతాపమునం
     బొరలఁగ నొకతటి సుయమి, వరుఁ డగు నారదుఁడు కరుణవత్సలబుద్ధిన్.195
వ. ఇచ్చటికి వచ్చి మమ్ముం జూచి మీరు శోకింపకుండుఁడు శంఖచక్రగదాధరుం డగు
     నారాయణుండు ధరణీభారావతరణార్థంబు గారణమానుషుం డై నరకాసురుం బరి
     మార్చి మీకు భర్త యయ్యెడి నని యాశ్వాసించె విశ్వభూతాత్ముం డైన

  1. భగోచరంబు
  2. తద్దోర్విభవచర్వితుం