పుట:హరివంశము.pdf/383

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము. ఆ. 4.

335

     యగుచు నా కేమిటం గొఱంత లేదు నీనెయ్యం బొక్కటియ కలిగినం జాలు
     ననియె నంత.206
తే. ఇంద్రుఁడు నుపేంద్రుఁడును సముదీర్ణపూర్ణ, హర్షచిత్తులై కూడి యయ్యదితిదేవి
     సదనమున కేఁగి తత్పుణ్యచరణములకు, వినతులై రట్టియెడ శచీవిభుఁడు నెమ్మి.207
వ. అయ్యఖండితచారిత్రకుఁ దదీయకుండలంబులు సమర్పణంబు సేసి కృష్ణుపరాక్ర
     మంబు సవిశేషంబుగాఁ గీర్తించిన నాయమ్మ సమ్మోదంబు నొంది యమ్మధురిపునకు
     వేనవేలు దీవన లిచ్చి యయ్యిద్దఱు నందనుల నభినందించి శచీసత్యభామలు
     ప్రణామం బొనర్చిన నాదరించి.208
మ. ఆరవిందోదరుఁ జూచి నాపగపు నీవాత్మీయదోర్వీర్యబం
     ధురతం జేసి తొలంగఁ ద్రోచితి భవత్పుత్రత్వ[1]మర్త్యత్వముల్
     బరికీర్ణంబయి యేకవాక్కుననె చెప్పన్ లేరు నీతోడ నె
     వ్వరుఁ ద్రైలోక్యహితాత్మజన్మవిధి భవ్యం బయ్యె నీ కెమ్మెయిన్.209
తే. అమరవిభుఁ డెట్లు సశ్వభూతావళికి న, వధ్యుఁడై యుండు నట్లు ప్రవర్ధనంబు
     నొందు నీవును రిపులకు నుర్వి నందు, నెవ్వరికి నోర్వరాక పెంపెసఁగుకడిమి.210
చ. వనితల కెల్ల నెక్కు డన వాలినపేర్మి వహించు నివ్వరా
     నన యగుసత్యభామయు ననన్యవిలాస మెలర్ప నిత్యయౌ
     వనరుచి నొప్పుఁగాత మనవద్యత నీవు మహీతలంబు పై
     ననఘ మనుష్యమూర్తి నెలరారఁగ నుండెడునంతగాలమున్.211
వ. అనియె నట్లు దేవమాతవలన లబ్ధవరుం డై యా సర్వలోకవరదుఁడు తల్లినిం
     దోబుట్టువును వీడ్కొని వైనతేయసమారోహణంబు సేసి దేవీసమేతంబుగా
     దేవోద్యానంబు నాలోకించుకౌతుకంబునం జని నందనప్రముఖంబు లగు వాని
     యందుఁ బరియించుచు.212

శ్రీకృష్ణుఁడు సత్యభామాప్రేరితుఁడై పారిజాతంబు గొని తెచ్చుట

సీ. మందాకినీపద్మమధువుల మాని తుమ్మెద లిద్ధకుసుమసంపదకుఁ జేర
     నిత్యంబు వేల్పుఁగన్నియలు శాఖాడోలలొంది యాటల వేడ్క నుల్లసిల్ల
     నాఁడునాఁటికి వచ్చి నవనవంబుగ నచ్చరలు హృద్యనైపథ్యరచన వడయ
     భువనసంచరణ విస్ఫుట[2]ఖేదమున సిద్ధమిథునముల్ నీడలు మెచ్చి నిలువ
తే. మేరునిర్ఝరపవనంబు మెలఁగ నూత్న, మంజరులఁ గదలించి వైమానికులకు
     సౌరభంబులు గొనిపోవ సార్వకాల, గరిమ నొప్పొరుకల్పవృక్షములు గాంచి.213
వ. అమ్మహీరుహంబులందు.214

  1. మత్యర్థమున్, పరికీర్త్యం బయి యెక్కె నాకు నుపమింపన్ లేరు
  2. ఖేదనంబున సిద్ధమిథునములు సేరి నిలువ