పుట:హరివంశము.pdf/369

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 4.

321

మ. క్రియఁ గోల్పోయి తపంబు పెద్దఱికమున్ గీడ్పాటునంబొంది య
     స్వయముం గంది కలంగి యిప్పగిది నే మత్యంతదుఃఖార్తియున్
     భయమున్ భావములందుఁ బైకొనఁగ నిన్ భక్తైకరక్షాస్ఫుర
     ద్దయు దేవేశు నుపాశ్రయించితిమి నిత్యస్తుత్య రక్షింపవే.85
క. నరకుం డిటు ప్రత్యక్షపు, నరకంబునఁ ద్రోచె నీవు నరసంతతికిన్
     నరకచ్ఛేదనకరుఁడవు, నరసఖ కరుణింపఁ దగు ననాథులఁ మమ్మున్.86
మ. త్రిజగద్రక్షణలీలకై తగు ధరిత్రిన్ దేవకీపుణ్యగ
     ర్భజుఁ డీ దేవుఁ డనంగ నుద్యదనుకంపా[1]శాలి వై తోఁచి యీ
     వృజినం బిప్పు డుపేక్ష చేసిన నగున్ విశ్వవ్యవచ్చేద మీ
     శ జితామిత్ర యొకింతవిక్రమసముత్సాహంబు నూహింపవే.87
చ. అను మునికోటిమాటలకు నచ్చెరువున్ వగపు న్మనంబులో
     బెనఁగొన దైత్యుచేతలకుఁ బేర్చినరోషము విస్ఫురద్విలో
     చనయుగళంబు భ్రాంతవిలసత్కరుణారుణకాంతిఁ జేయ న
     ద్దనుజ[2]విభేది మ్రానుపడి తానొకపల్కును బల్క కత్తఱిన్.88
వ. చింతాస్తిమితమూర్తియై యున్నం జూచి వెఱుపును సంశయంబును సంభ్రమం
     బును సందడింప మునీంద్రు లందఱు నొండొరుల [3]మొగంబులు చూచి యేక
     ముఖం బగు చిత్తంబుతో నయ్యుత్తమశ్లోకు నుదాత్తశ్లోకసనాథ లగు [4]దివ్య
     గాథల ని ట్లని పరికీర్తనం బొనర్చిరి.89
సీ. జయజయ జగదీశ జయ దనుజధ్వంసీ జయ జనార్దన జయ సర్వవంద్య
     జయజయ గోవింద జయ కృష్ణ వల్లవీవల్లభ జయ యాదివరవరాహ
     జయజయ నరమృగాశ్చర్యశుభాకార జయ కుబ్జకూర్మప్రసన్నరూప
     జయజయ సర్వజ్ఞ జయ హృషీకేశ నారాయణ జయ సరోజూక్ష వరద
తే. జయ శరణ్యపదాంభోజ జయ ప్రసన్న, జయ మనోరథదాయక జయ ముకుంద
     జయ జయావాస జయ నిత్యసత్యకీర్తి, మమ్ము నిటు సూడవే కృపామధురదృష్టి.90
క. నీవు విషణ్ణుఁడ వగుటయు, నీవిశ్వంబునకుఁ జాల నెగ్గు జనించున్
     నీవిశ్రుతప్రసాదస, మావేశము సర్వమంగళావహము హరీ.91
మ. సకలంబు గలిగింపఁ బెంప నణఁపన్ శక్తంబు మూర్తిత్రయా
     త్మక మక్షోభ్యము నీమహత్త్వము భవన్మాయానుభావంబు వా
     రక యవ్వారిరుహాసనాదుల కనిర్వాచ్యంబు సర్వాత్మ నీ
     ప్రకృతిం జూతు రనాదిమధ్యనిధనప్రాధాన్యగా బోధనుల్.92
మ. ప్రణతత్రాణపరాయణత్వ మెద సంభావించి సంభూతియున్
     గుణకర్మప్రవిభాగపాటవముఁ గైకొంటన్ భవత్పూజన

  1. కారి వై
  2. విరోధి
  3. ముఖంబులు
  4. వీర్య