పుట:హరివంశము.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము ఆ. 1.

247

తే. బలములన్నియు విడియంగఁ బనిచి జతన, పఱిచి విభ్రమించినఁ పదపడి నృపాలుఁ
     డఖలభూపాలవరులఁ బ్రియంబుతోడఁ, బిలిచి యుత్సాహవిభవగాంబీర్య మెసఁగ.81
వ. ఇ ట్లని యాజ్ఞాపనం బొనర్చె.82
సీ. ఎక్కుఁడు వలనైనయెడ లడ్డగించినచఱుల నుగ్గడఁపుఁడు సక్కఁ బ్రాఁక
     రానితిప్పలు [1]చొరఁ ద్రవ్వుఁ డీఱము లైనమ్రాఁకులు మట్టలు మ్రగ్గఁ బొడువుఁ
     డెదిరి పైకొని మీఁద నెవ్వఁడుఁ దలసూప[2]కుండంగ దివము బాణోత్కరములఁ
     గప్పుఁ డీఁటెల సెలకట్టియలను [3]వ్రేయుఁ డొడిసెలకాండ్రను నొడ్డుఁ డెందు
తే. నేల మన కింకఁ దడయఁగ నిన్నగమున, నున్నవారు యాదవు లని విన్నవార
     మిచటి మృగపక్షు లాదిగా నెల్ల మనకుఁ, బగఱ పొరిగొనుఁ డత్యుగ్రభంగి దోఁప.83
వ. మద్రపతియును గాళింగుండును జేకితానబాహ్లికులును గాశ్మీరవిభుం డగు
     [4]గోవర్ధనుండును గారూశుం డగు ద్రుముండును బార్వతేయులుం బర్వతపశ్చిమ
     దిగ్భాగం బెక్కువారు పౌండ్రుండును వేణుధారియు వైదర్భు డగు శ్రాముం
     డును భోజనాథుఁ డగు రుక్మియు దానవశ్రేష్ఠుం డగు సూర్యాక్షుండును
     బాంచాలేశ్వరుం డగు ద్రుపదుండును నవంతినాయకు లగువిందానువిందులును
     దంతవక్త్రపురమిత్రులును మాత్స్యుం డగు విరాటుండును గౌశాంబిమాళవులును
     భూరిశ్రవుండును ద్రిగర్తుండును గ్రథకైశికపంచజనులును శైలంబు నుత్తర
     పార్శ్వంబు బ్రాఁకువారు, కేరళుం డగు నులూకుండును నేకలవ్యుండును
     బృహత్క్షత్రజయద్రధులు నుత్తమోజుండును సాళ్వకౌశికులును విదిశాధీశుం
     డగు వామదేవుండును భూభృత్పూర్వప్రదేశం బాక్రమించువారు, దరదతుంది
     చేది రాజసమేతుండ నై యేను ధరణీధరంబు దక్షిణకటకంబు [5]తలద్రొక్కెద,
     వీరు వా రన వలవదు గదలను [6]గునపంబుల ముసలంబులం గొండఁ దుమురుసేసి
     నేఁడ కృతకార్యుల మై మరలుద మనిన జరాసంధువచనంబులు విని శిశుపాలుం
     డి ట్లనియె.84
మ. విపులోత్తుంగశిలావిటంకముల నావిర్భూతదుర్భేదపా
     దపగుల్మావలులన్ సురాదుల కసాధ్యం బిమ్మహాదుర్గ మీ
     నృపసింహు ల్బహువాహనంబులపయిన్ విశ్రాంతి వాటించువా
     రపథవ్యాప్తిఁ బదప్రచారములఁ జేయన్ శక్తులే యిగ్గిరిన్.85
క. పెక్కండ్రము గల మని యి, ట్లుక్కునఁ జొరఁబడుట నీతియు నుపాయముఁ గా
     దక్కజ మగు దైవబలం, బెక్కుడు బాలు రనవచ్చునే యాదవులన్.86
తే. [7]దుర్గ మొదవినయప్పుడు దురముచేఁత, కంటె రోధించి యుండుట కరము లెస్స
     తడవుగా నున్నపగతురు తమకుఁ దార, నిక్కముగఁ [8]జెడుదురు కూడు నీరు లేక.87

  1. జొరఁ జేరుఁ డీయిరుమైన
  2. నొదవంగ
  3. వైవుఁ
  4. గోనందుండును (సం. ప్ర); గోనర్దుండు.
  5. పగులఁద్రొక్కెద
  6. గుదుపలు
  7. దుర్గములు వొదవినపుడు దురముసేఁత
  8. జేరుదురు