పుట:హరివంశము.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 7

175


వ.

ఇది యింద్రోత్సవంబు పరమకల్యాణంబు మాకుం బ్రతివత్సరంబును గర్తవ్యం
బై యుండు ననిన విని దామోదరుండు గోపాలు రెల్ల విన ని ట్లనియె.

129


క.

కరిసనమును బేహారము, నరసి పసులఁ గూర్చుటయును ననఁగా వృత్తుల్
నరులకు నిం దెవ్వనికే, వెర వుచితం బదియ వానివేల్పై యుండున్.

130


ఉ.

కానలలోఁ జరించి గిరి[1]కందరలన్ వసియించి గోవులన్
మానుగఁ బెంచి వీనివలనన్ బ్రదు కొంది మనన్ సుఖంబుమై
భూనుత యున్నవార మటు బుద్ది నెఱింగిన నెల్లభంగులం
గానలు గొండలుం బసులు గాదిలివేల్పులు గొల్లవారికిన్.

131
క.

ఎలమిఁ దమజాతి వేల్పులఁ, గొలిచి యుభయలోకసుఖము గోరుట దగుఁగా
కిలువేల్పులుండఁ గొలుతురె, పలువేల్పుల నెవ్విధంబు పాలసులైనన్.

132


ఆ.

కర్షకులకు నెలవు గ్రామసీమావళి, యవుల నడవు లిండు లాటవికుల
కడవులందు [2]గొండపడలు మనకుఁ జోటు, లింతవట్టు దెలియ నెఱుఁగవలయు.

133


వ.

అదియునుంగాక పర్వతంబులుఁ గామరూపంబు లగు వేల్పులు గావున సింహశా
ర్దూలాదులం దావేశించి యాత్మీయంబు లగునరణ్యంబులకు బాధకు లగుదుర్వి
నీతుల వధియించి నిజస్థానరక్షణం బొనర్చుచుఁ దమ్ముం గొనియాడు గహనోప
జీవులకు ననుగ్రహంబు సేసి తదీయధనంబుల కెల్ల దెసల సేమంబు గావించు నని
విందుము.

134


తే.

మంత్రయజ్ఞులు విప్రులు మహితసీర, యజ్ఞు లరయఁ గృషీవలు లద్రియజ్ఞు
లనఘ [3]గోపాలు రటుగాన నచలపూజ, యుత్సవంబుగాఁ జేయుట యొప్పు మనకు.

135


క.

వెడబుద్ధు లుడిగి నాచె, ప్పెడుమతమున మీరు గోత్రభిత్పూజతెఱం
గెడలించి గోత్రపూజకుఁ, గడఁగుఁడు పనుపుఁ డిదిపల్లె గ్రమ్మఱఁ జాటన్.

136


క.

మన మేమి యెఱుఁగుదుము శ, క్రుని నమనలు మురులు నతనిఁ గొలుతురుగా కి
వ్వనములు గిరులును మనచూ, చినమేరలు వీని మానఁ జెప్పిరె పెద్దల్.

137


ఆ.

చేయరైతిరేనిఁ జేయింతు మిము నిది, బలిమి నైన నన్ను వలతు రేనిఁ
బ్రియము దప్పకుండఁ బెద్దఱికంబుతోఁ, గొండపండు వియ్యకొండు సేయ.

138


క.

అని పెక్కుదెఱంగులఁ జె, ప్పినకృష్ణుని వాక్యములకుఁ బ్రీతి యెసఁగ నా
తనినెమ్మోము ప్రియంబునఁ, గనుఁగొని యి ట్లనియె గోపగణనికరంబుల్.

139

గోపాలకులు కృష్ణోపదేశంబున నింద్రోత్సవంబు మాని పర్వతోత్సవంబు చేయుట

మ.

కర మిష్టంబు సమస్తగోపకులయోగక్షేమనిర్వాహకం
బరయం దథ్యము పథ్య మివ్విధము నీయాజ్ఞం బ్రవర్తిల్లఁగా
దొరఁకో లల్పమె యెల్ల కార్యముల సంతోషంబ మాబుద్ధులన్
శరణం బాపదలందు నీవ యని విశ్వాసంబు భాసిల్లఁగన్.

140
  1. కందరముల్
  2. కొండదడియలు మనబోఁట్ల, కింతమట్టు
  3. వల్లవుల