హరివంశము
పూర్వభాగము - షష్ఠాశ్వాసము
|
శ్రీకరకవిప్రబంధా
నేకముఖవినిర్గతాత్మహితకీర్తిసుధా
నేకధవళాయమానమ
హాకమలభవాండధామ యన్నమవేమా.
| 1
|
వ. |
అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పినట్టివర్తనంబులఁ గొంతకాలంబు
నడపి యమ్మహాప్రభావుం డగువాసుదేవుండు విదితనిజసద్భావుం డగుబలదేవున
కి ట్లనియె.
| 2
|
క. |
అనఘ విను మొకటి చెప్పెద, నెనయఁగ మన పుట్టిబుద్ధియెఱుఁగుట మొద లి
వ్వనము నివాసం బై నది, మనవారికి నింక [1]నిచొటు మంచిది యగునే.
| 3
|
వ. |
పెద్ద కాలం బొక్కచోట నునికి వారలకుం బ్రశస్తంబు కాదు దీనన చేసి యిప్పుడు.
| 4
|
సీ. |
[2]ఎరువుతిప్పలుగొని యెల్లమందలు [3]గొనుజెక్కి మేపుడుచోటు ద్రొక్కువడియెఁ
దరు లోలి నఱుక మొదళులు సిక్కంగ జొంపము లేది జాడలువడియెఁ బొదలు
మడువులు పసులకాల్మడిఁ బ్రుచ్చె [4]దొరుగండివ్రంకలు పెనురొంపివ్రంతలయ్యెఁ
బూరిపంటలు చెడిపోయె [5]రాయిడిఁ గ్రంపలోనుగా దవ్వులఁ గాని [6]లేదు
|
|
తే. |
పులుఁగు పూరెడు [7]పోపడి పొలములందు, మెలఁగి వెదకినఁ బుట్టదు మెకము లడఁగెఁ
[8]గూరగాయకట్టియ విల్చికొనఁగ వలసి, యునికి వ్రేపల్లె వీటిపట్టునకు [9]దొరఁగె.
| 5
|
వ. |
కావున మన మింక నిచ్చోట వసియించుట దుఃఖావహంబు బృందావనంబు
బృందారకవనసుందరం బైనకాననం బందు గోవర్దననామధేయంబునం బరఁగి
యథార్థనామధేయం బగు భూమీధరంబున భాండీరాఖ్యం బ్రఖ్యాతినొంది
నిఖిలవనమండనం బయి యనంతశాఖామండలంబున నుత్కటం బగు [10]వటంబును
విందు మయ్యరణ్యంబునడుమ నమరభువనంబున నమరు నమరనదియునుంబోలె
గాళింది యొప్పారు నవధూతసారం బైనయిక్కాంతారంబు విడిచిపోయి యన్నెల
వున సుఖియింతము మనపల్లెలోని ముదుసళ్లు మచ్చిగ పేర్మి నిచ్చోటు విడువంజాలి
|
|
- ↑ నిచటు; నిచట.
- ↑ ఎరువు దిబ్బలుగొని
- ↑ జూడఁ జిక్కి చిక్కనిచోటఁ
- ↑ పెదదొడ్డిగ్రంతలు
- ↑ గాయలు
- ↑ లేవు
- ↑ ప్రియపడి
- ↑ కూరగాయలు గట్టెలుఁ గొనఁగవలసె
- ↑ వలసె
- ↑ వటంబన