పుట:హరివంశము.pdf/184

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

136

హరివంశము


ట్టితెఱం గేమియు లేక [1]యర్భకునికృష్టిం గూలె నీయున్నత
క్షితిజాతంబులు దీనికంటెఁ గలవే చింతింప నుత్పాతముల్.

251


వ.

మున్నును శిశుఘాతినియైన పూతన నిపాతంబు నొందె మహాశకటం బద్భుతవిఘ
టనంబునం బొలిసె నిక్కడ నునికి మన కింక నెంతలెస్సయయ్యెడు నని యాశంకిత
చిత్తులయ్యును మక్కువవలన నచ్చోటు విడువఁ గొనకొననిమనంబులతోడ
నందగోపసహితు లై తమ తమ నివాసంబులకుం జని రివ్విధంబున.

252


క.

గోము మిగుల వ్రేపల్లెను, ధీమంతులు రామవాసుదేవులు బాల్య
శ్రీ మెఱపి యట్టిసప్తస, మామహితవయస్కులై సమంచితలీలన్.

253


వ.

తమయీడు గోపాలబాలకులం గూడి యాడ వత్ససముదాయపాలనంబుల
వినోదంబుగాఁ బ్రమోదింపం దొడంగి రమ్మహోత్సవసమయంబున.

254


తే.

చిఱుతకూకట్లు [2]దూఁగాఁడఁ జేతిచల్ది, చిక్కములు సెలగోలలు చెలువు మిగులఁ
[3]గఱ్ఱచెప్పులు దొడి నున్నగఱ్ఱితడుపు, లెలమితోఁ గట్టి చేరువ పొలములందు.

255


చ.

వృకములఁ దోలి యార్చుచును వేడుకఁ బాడుచుఁ గూఁత వైచుచుం
బ్రకటమహీరుహాగ్రములు ప్రాకుచు జున్నులు రేఁచి తేనె గో
పకులకుఁ బోయుచుఁ మధురభ క్తము సే కళులారగించుచున్
సకలమనోజ్ఞఖేలనరసంబునఁ దేలిరి బాలయాదవుల్.

256


వ.

అని వైశంపాయనుండు జనమేజయునకుఁ గృష్ణశైశవచరితంబు కర్ణరసాయనంబు
గావించిన దివ్విధం బఖిలంబును సుఖశ్రవణం బగువచోవిభవంబున.

257


మ.

కమలానిత్యనివాసవక్ష కమలాక్షా సంతతోత్ఫుల్లహృ
త్కమలామోద కళా[4]వివేక జితలోకా సర్వధౌరేయ దోః
కమలాంగీకృతదానకల్ప శుభసంకల్పా విపక్షా[5]వళీ
కమలాపాయద ఖడ్గనీరద సమీకప్రీతిమన్నారదా.

258


క.

గుజ్జరిధట్టవిభాళసు, హృజ్జీవనదాయి హార్ధ హేలాభుజసం
పజ్జితధనసంపూజిత, సజ్జనసందోహధర్మసాధకదేహా.

259


మాలిని.

యవననృపబలాబ్ధివ్యాపిఖడ్గౌర్వవేగా
జవనహయఖురాగ్ర[6]చ్ఛాదిభూమ్యంతభాగా
భవన[7]భరితలక్ష్మీబద్ధనిత్యానురాగా
భువనయుగహితైకస్ఫూర్తిమత్త్యాగభోగా.

260


గద్యము.

ఇది శ్రీశంకరస్వామిసంయమీశ్వరచరణసరోరుహధ్యానానంద సౌందర్య
ధుర్య శ్రీసూర్యసుకవిసంభవ శంభుదాసలక్షణాభిధేయ యెఱ్ఱయనామధేయ
ప్రణీతం బైన హరివంశంబునం బూర్వభాగంబునందుఁ బంచమాశ్వాసము.

  1. యర్భకవిసృష్టిం
  2. దూఁగూడ
  3. గిఱ్ఱుచెప్పులు (పూ. ము.) బట్టచెప్పులు దొడ్డను న్బట్టతడువు
  4. వివేశ
  5. సరీ
  6. చ్ఛాత
  7. చరిత