పుట:హరివంశము.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

130

హరివంశము


గలిగావునం గ్రమ్మఱం జనుదెంతు నని జలావగాహనంబున కరిగి మగుడునప్పటి కిది
[1]యిట్లై యున్నయది మనభాగ్యంబునం గుమారు నీబారి గడచె ననునెడం
గొందఱు బాలు రచటికి వచ్చి యిట్లనిరి.

189


క.

ఏ మిచట నాడుచుండం, గా మీకృష్ణుండు [2]తనదుకాలు గడఁకతో
నీమీఁది కెత్తి చాఁచిన, నీమెయిఁ దలకెడవువడియె నిబ్బండి వెసన్.

190


క.

ఇది యేమిదైవికమొ మీ, మదిలోఁ దెలిసికొనుఁ డనిన మగువయుఁ బతియున్
బొదలెడు విస్మయము మనో, ముదముం [3]దళుకొత్తఁ గొడుకు ముద్దాడి తగన్.

191


వ.

అచ్చో భూరజంబు వుచ్చి పిడిచి వైచి తూపొడిచిరి విశ్లేషించి నందుండు
బృందారకుల కెల్ల వందనంబు సేసి నందనునకు నభయప్రదులు గా నభ్యర్ధించె
నాలోనన యెల్లవారును వచ్చి యచ్చెరువు నొందుచు నబ్బాలు నభినందించి
రా గోపముఖ్యుండు శకటంబు క్రమ్మఱ సంఘటితంబు గావించి సుఖంబున నుండె
నంతఁ గ్రమంబున.

192

శ్రీకృష్ణమూర్తి బాలక్రీడాభివర్ణనము

సీ.

పొలుపారఁగా బోరగిలి పాన్పు నాల్గుమూలల[4]కును వచ్చును మెలఁగి మెలఁగి
లలిఁ గపోకంబులు గిలిగిలింతలు పుచ్చి నవ్వింపఁ గల కల నవ్వినవ్వి
ముద్దులు [5]దొలఁకాడ మ్రోఁకాలఁ గేలను దడవుచు నెందును దారితారి
నిలుచుండఁ బెట్టి యంగుళు లూఁత సూపఁగాఁ బ్రీతిఁ దప్పుడుగులు పెట్టి పెట్టి


తే.

యన్నఁ గంటిఁ దండ్రినిఁ గంటి నయ్యఁ గంటి, నిందు రావయ్య విందులవింద వనుచు
నర్థిఁ దనుఁ బిలువఁగ [6]నడయాడియాడి, యుల్లసిల్లెఁ గృష్ణుఁడు శైశవోత్సవముల.

193


ఉ.

ఎవ్వరు గన్న నెత్తికొని యెంతయు వేడుక ముద్దులాడఁగా
నెవ్వలఁ బాఱిపాఱి [7]తరళేక్షణ దీధితు లొప్ప [8]నొప్పుమై
మువ్వలు గంటలు న్మొరయ ముందటికూఁకటి రావిరేకతో
నవ్వనజాక్షుఁ డాడుఁ జెలువర్మిలిఁ బెందు జనంబు చూడ్కికిన్.

194


తే.

మన్ను రొంపియుఁ బెండయు [9]మంటు వట్టి, పాంసుసంక్రీడఁ దనమేను భాసురముగ
హరి యనేకధాతుచ్ఛటావ్య క్త మైన, శైలకుంజరకలభంబు [10]వోలె నొప్పె.

195


క.

చాలఁ[11]గ నిచ్చలు వెన్నయుఁ, బాలుం గుడుకలఁగొని తల్లి పట్టికి సెలవిన్
వ్రేలిడి యింతింతియ కాఁ, గ్రోలిందును వెరవుతోడ రుచి [12]గొలుపుక్రియన్.

196


తే.

ముదముతోఁ గడ్పునకుఁ [13]బెట్టి మూతిజిడ్డు
మోమునను మేనఁ జమరి యమ్ముదిత యక్కు

  1. యిట్టులయ్యున్నది
  2. లేచి
  3. దలకొలుపఁ
  4. యందును గలయ
  5. దులు
  6. నడిబాడి
  7. ధవళేక్షణ
  8. ఁద్రోపుమై గొప్పలై
  9. మనలు
  10. బోలియొప్పె
  11. దరిచల్ల
  12. గోల్చు
  13. బోసి