పుట:హరివంశము.pdf/179

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 5

131


[1]గలయ నిమురు నేనుఁగుదిన్న వెలఁగపండు
నాఁగ నొప్పుఁ గృష్ణుఁడు [2]చారునయనుఁ డగుచు.

197


మ.

తను నాప్యాయితుఁ జేసి [3]ఱేపు గృహకృత్యంబు ల్పొనర్పం దొడం
గినతల్లిం గినుమాడి తప్పడుగులం గ్రీడారతిం బోయి యం
గనలన్ వెన్నలు వేడుఁ బెర్వు దరువంగా నెంతయేఁ బెట్టినం
దనియం డింపుగ మ్రింగు మానఁ డొకటం దావారిఁ గారించుటల్.

198


క.

తరిద్రాడుఁ జేతికవ్వము, దిరుగకయుండంగ బట్టుఁ దెమ్మని తిగుచున్
బొరిబొరి గనయంబున ముడి, విరియ వలువచెరఁగు వట్టి వ్రేతల నీడ్చున్.

199


తే.

వెన్న వెట్టెద మాడుమాయన్న యన్న, మువ్వలును మొలగంటలు మొరయనాడు
నచ్యుతుఁడు గోపికలు దమయాత్మ బ్రమసి, పెరువు దరువను మఱచి సంప్రీతిఁ జూడ.

200


క.

ఏనిక కొదమకరంబున, మానుగ వెలిదమ్మిమొగడమాడ్కిఁ బొలుచు న
ద్దానవరిపుచేతం బొలు, పై నవనీతంపుఁగబళ మనుపమకేళిన్.

201


క.

సురలు దరువఁగ సుధాశీ, కరములు [4]మెయిఁ జిలుకునట్టికల్యాణం బా
పురుషోత్తమునకు నొదవున్, దరుణీనిర్మధనలగ్నదధిబిందువులన్.

202


ఉ.

పాపనిఁ బట్టరమ్మ యని బాధల కోర్వక తెచ్చి తెచ్చి తన్
గోపిక లయ్యశోదకును గుప్పున నొప్పనసేయఁ జేయ నా
గోపిక [5]యందునందుఁ జని గోకుల మిల్లిలు దప్పకుండ ల
క్ష్మీపతి గ్రుమ్మరుం గడియసేపున రేపున నిచ్చనిచ్చలున్.

203


వ.

ఇవ్విధంబునం గ్రమక్రమప్రవర్ధమానుం డయి తానును బలదేవుండును బెక్కండ్రు
బాలురు గేళీలాలసు లై తన్నుం బొదివికొని తిరుగ బల్లిదుఁ డై వ్రేపల్లె నెల్లెడలం
గ్రీడించునప్పుడు.

204


చ.

పనఁటులఁజట్ల మూఁతియిడి పాలును నేయియుఁ బుక్కిలించియుం[6]
దొనుకుచు దోయిలించి కళతోయరుహంబులఁ జల్లి మంటిలో
నెనయఁగఁ ద్రొక్కి త్రొక్కి ధవళేక్షణరోచు లెలర్ప నాడు నె
వ్వనికిని మాన్పరాక యదువంశకుమారుఁ డుదారచేష్టలన్.

205


క.

[7]తరువం బెట్టినచట్టుల, పెరువులు మును గిలుకరించి [8]పెట్టిన వెన్నల్
[9]నురువు లెసఁగంగ గ్రోలియు, సురలం ద్రోచియును జూపుచుండును గ్రీడల్.

206


శా.

క్షీరాంభోధి మధించి తాను గృపతో గీర్వాణకోటిన్ సుధా
పూరప్రీతగఁ జేసినట్టి చెలువంబుం జూపున ట్టింపుగా
నారం గాఁగినపాలమీఁగడలు హస్తాబ్జంబులం [10]దేవి లీ
లారమ్యంబుగఁ దోడిబాలురకు నెల్లం బెట్టి తానుం గొనున్.

207
  1. 'గలయ నిమిరి యేనుఁగు' అను పూర్వపాఠ మనన్వితముగాన పైరీతి దిద్దఁబడినది.
  2. సౌశ్రు
  3. దేవ
  4. పయి
  5. నాగ నాగ
  6. యెం దునిమియు
  7. తరువఁగఁ బెట్టిన బానల
  8. పేర్చిన
  9. నురువు లెసఁగఁ గ్రోలి పిదప, సురులు ద్రోచుచును బోవు నుక్కివపుగతిన్.
  10. గేలి