పుట:హరివంశము.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 5

129


బన్న కుమార యింకిపుడ యర్థి భవజ్జనకుండు వచ్చి న
న్నెన్నిదెఱంగులం బఱుపఁ డింతయుఁ జూచి తనర్చునల్కతోన్.

178


క.

ఈ మెయి శకటం బెడలుట, కేమిగతము దీని నెవ్వ రెఱుఁగుదురు విభుం
డేమి యది యనిన నుత్తర, మే మని నే నిత్తు నింద యిడుదురు నాకున్.

179


వ.

అని తలంకుచు నంకతలంబునఁ గొడుకు నిడి చన్నిచ్చు సమయంబున.

180


సీ.

పరిమితపలితైకభాసురం బగుకేశసంచయం బారణ్యసంచరమునఁ
[1]దరువుల రాలు "కేసరముల నత్యంతధూసరం బై కడుమాసరముగ
గోఖురోద్ధతరేణుకుంఠితం బగుమోము చెమటబొట్టులఁ జాలఁ జెన్ను మిగులఁ
గట్టినచెంగావికాసె లేఁజిగురులజిగి నూని తను వతిస్నిగ్ధ కాంతి


తే.

నలరఁ గర్కశగ్రంధిలయష్టి చేతఁ, బట్టి గోపాలపరివారబహువిధోక్తు
లెలసి చెలఁగంగఁ గదుపులవలననుండి, వచ్చె నందగోపుఁడు నిజావాసమునకు.

181


వ.

వచ్చి విగ్రస్తచక్రంబును విభగ్నాక్షంబును విభిన్నభాండంబును నైనశకటంబు
గనుంగొని తదీయాంకతలంబునంద తనయు నెప్పుడు నునిచి యుండుంగావున.

182


తే.

తలఁకి యుల్లంబు ఝల్లనఁ దనువు వడఁక, నకట బాలకుఁ డిప్పు డే మయ్యెనొక్కొ
[2]బండి యఱవఱలై యిట్లు పడ్డ దేమి, మూఁడెనో యంచు నరిగి సమ్ముఖమునందు.

183


మ.

స్తనదుగ్ధామృత మారగించుచుఁ బొరిం జారుస్మితోల్లాస మా
ననబింబంబు నలంకరింప వికసన్నాళీకపత్రాభలో
చనదీప్తుల్ జననీముఖేందువుపయిన్ సంప్రీతిఁ బర్వంగ నొ
ప్పునిజాభీప్సితకల్పశాఖిఁ గనియెం బు త్రుం [3]బవిత్రోదయున్.

184


క.

కని గుండె నిమిరికొనుచును, ననురాగముతోడ నంతనంతఁ దనకుటుం
బిని నిది యేమి శకట మి, ట్లన[4]యంబును విషమవృత్త మయినది యిచటన్.

185


తే.

ఒల్లిదంపు[5]టాఁబోతులు పెల్లురేఁగి
తొడరి త్రోచి త్రొక్కెనొ మహోద్ధురసమీర
హతియు [6]నిచ్చోటఁ గలిగెనో యదియు నింత
సేయఁ [7]గాదు నిజం బేమి చెపుమ దీని.

186


వ.

అని వెండియు.

187


క.

అది యెట్లై నను గాని, మ్మిదె నాపుత్రునకు నేమ మింక నఖిల మ
భ్యుదయమ యనఁగాఁ గడుగ, ద్గదిక నెలుఁగు దగులుపడఁగఁ దద్భామినియున్.

188


వ.

అతని నాలోకించి నావలనం దప్పు సాలఁ గలదు మీరు సహింపవలయు నే
నిప్పాపని నెప్పటియట్ల యీ[8]బండిక్రింద మంచంబున [9]నిదుర వుచ్చి యేఱు కుఱం

  1. దురువుల
  2. భండి
  3. బవిత్రోత్రోచ్ఛవున్
  4. యము విపరీత
  5. టంబోతులు
  6. లేదు కల్గెనయేని
  7. నేరదు
  8. భండి
  9. నిద్ర