పుట:హరివంశము.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 4


శా.

దీప్తజ్వాలము లొక్కపెట్ట దెసలం దీవ్రానుబంధోగత
వ్యాప్తిం బర్వఁగ సర్వదానవబలవ్యాలగ్నుఁడై వచ్చునా
సప్తార్చిన్ బలవంతుఁ జేయుచు నభస్వంతుండు దుర్దాంతుఁడై
సప్తస్కంధములం గదల్చి పొదలెన్ సంపాతచండాకృతిన్.

132


ఉ.

ఘోరయుగాంతవహ్నిఁ బటుగోత్రనగావళియెల్ల భస్మసా
త్కారము నొందునట్లు చెడి ధారుణిఁ జూర్ణపుఁబ్రోవు లయ్యె న
మ్మారుతమిత్రుచే రిపులమాయపుఁగొండలు దేవశత్రులున్
భూరిరథాశ్వనాగచయపూర్వముగాఁ బొడియైరి పోరిలోన్.

133


వ.

ఇట్లు సకలసైన్యంబులు సమసిన మయుండు సవిస్మయుం డై తిరిగె దొరలును
సై రింపలేక తొలంగిరి చెలంగి రథాంగధరుఁ గీర్తించుచు నమర్త్యులు సమరజయ
విభాసితు లైరి లోకంబులు ప్రమోదమేదురంబు లై పొదలె నెందునుం దొంటి
యట్ల మహాధ్వరంబులు ప్రవర్తిల్లెఁ దపోధనులతపంబులు నిర్వఘ్నంబు లై తల
కొనియె ధర్మంబును బ్రబల బై నలుకాళ్లును మాపి నడచె సమ్యక్పరిపాల
నంబు గాంచి భూదేవి భూరిస్థైర్యంబు వడసె వర్ణంబులు నాశ్రమంబులు నిజా
చారంబు లంగీకరించె నంత.

134

ఇంద్రాదిదేవతలతోడఁ గాలనేమి యను రాక్షసుఁడు యుద్ధము చేయుట

సీ.

రౌద్రరసస్వభావోద్రేక మంతయు సాకారమై తనరారె ననఁగ
వీరగుణోల్లాసవిభవంబు సర్వంబు నవయవప్రౌఢిఁ గ్రొవ్వలరె ననఁగ
గర్వసర్వస్వరేఖాతత్వ మఖిలంబు విగ్రహవ్యాప్తి గావించె ననఁగ
దర్పసంభారదుగ్ధమవిశేషం బెల్లఁ దను[1]వికాసంబు గైకొనియె ననఁగఁ


ఆ.

బ్రళయకాలదహనుప్రతిబింబ మనఁగఁ గృ, తాంతరోష నికృతి కాత్మ యనగ
నెగడువాఁడు కాలనేమి నా నొకదైత్యుఁ, డపరిభావ్య బలనిరస్తరిపుఁడు.

135


క.

శతభుజుఁడు శతశిరస్కుఁడు, శతశిఖరోదగ్రశైలసదృశుఁడు దీప్తా
యతపింగశ్మశ్రు[2]కచా, న్వితనీలశరీరుఁ డుగ్రవీక్షణుఁ డెందున్.

136


వ.

వనరుహాసనువలన లబ్ధవరుండు గావున నసురుల పరాభవంబునకు నమరుల విజ
యోత్సవంబునకుఁ గరంబు గలుషించి దనుజనాయకుల నందఱ నాశ్వాసించి
పురికొల్పుకొని క్రమ్మఱ సర్వసైన్యంబుల సమకట్టించి యగ్రణి యై సురలమీఁద
నెత్తి నడతెంచిన నాదిత్యు లందఱు నత్యంతసంరంభంబున జంభారి పురస్సరుం
డుగాఁ గడంగి రప్పుడు.

137


క.

బలియుఁ డగు ప్రభువు తమకుం, గలిమిం [3]దన కెదిరి రిపులఁ గన్నంతన దై
త్యులు మది నరవాయిగొనక, యలఘుప్రహరణమహోగ్రులై తాఁకుటయున్.

138
  1. వికారంబు
  2. కటా
  3. తలంకేరి