పుట:హరివంశము.pdf/146

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

హరివంశము


సీ.

అంభోధిసుతుఁడ వనంతరసోదయంబులకుఁ గర్తవు సర్వభూతములకుఁ
[1]బోషకుండవు సమస్తౌషధీవిభుఁడవు యజ్ఞంబులకుఁ బ్రాణమై తలిర్తు
సుధకు నాధారమై శోభిల్లు వాత్మవై యోగీశ్వరులకు మృత్యువు హరింతు
భూచ్ఛాయ మచ్చగాఁ బొలుపారు తనుకాంతిఁ బ్రసరించి తిమిరంబుఁ బరిభవింతు


తే.

నీమహత్త్వంబు [2]మునివర్ణనీయ మట్లు, గాన దివిజుల కైనయక్కఱ దొలంగఁ
జేయు మిప్పాశపాణియు శీతకిరణ, నీకుఁ దోడ్పడు ననవుడు నెమ్మి నతఁడు.

122


వ.

పాకశాసనుశాసనంబు గయికొని దనుజానీకంబుపైఁ గడంగి.

123


మ.

స్ఫురదాల్మీయమయూఖము ల్గలయ [3]నంభోభృత్పథం బంతయుం
బరఁగం జేసిన మాసె నౌర్వదహనస్ఫారాకృతిం గ్రాలు దు
ర్భరమాయావిసరంబు దానవులదర్పస్ఫూర్తియున్ డిందె న
ట్లరుదై యొప్పెడు [4]సేఁతఁ జేసి విధుఁ డుద్యద్ధాముఁడై వెండియున్.

124


మ.

క్షితి యాకాశము దిక్కుల [5]న్దెలివి సూడ్కిం జెంద నీ కెందు [6]ను
ద్యతసాంద్రోద్ధతిఁ బర్వుదుర్విషహనీహారంబుఁ బూరించి భూ
రితరా[7]రాతిబలంబులం బొదిని మూర్చిల్లన్ విభేదిల్లఁ గం
పితచేష్టన్ [8]దురపిల్ల విహ్వలదశన్ భీతిల్లఁ జేసెన్ వెసన్.

125


క. హిమకరునికురియుమంచున, బ్రమసి ముకుఁగుదైత్యకోటిఁ బాశాహతిన్
సమయించె వరుణుఁ డవ్విధ, మమితాద్భుతకారి యయ్యె నాలోకింపన్.

126


వ.

ఇత్తెఱంగునం బ్రాలేయపాశప్రహరణు లైనయయ్యిందుప్రచేతసులచేత నచేతనం
బై తూలు దైతేయసైన్యవ్రాతంబులం జూచి మయుండు క్రమ్మఱ నాత్మీయ
సూసుం డగు క్రౌంచుండు నిర్మించిన పార్వతి యనుమాయ గీర్వాణులదెసఁ బ్రయో
గించి ప్రచండగండశైలకరాళంబును బ్రబలపవనోద్ధూతపాదపోత్కటకూ
టంబును బ్రకుపితపంచాస్యవ్యాఘ్రఘోర[9]కుధరంబును నగుపర్వతసంచయంబు
సర్వదిశలం బుట్టించిన.

127


ఆ.

కోటిరాలు వచ్చి కూలె మ్రాఁకులు వచ్చి, పొదివె సింగములును పులులు వచ్చి
కఱచె నట్టిభంగి గాసియై రమరులు, మాసెఁ జంద్రవరుణమదముపేర్మి.

128


క.

తలలు వగిలియును జేతులు, నలిసియుఁ గాళులును దొడలు నడుములుఁ బార్శ్వం
బులు నొగిలియు వాహనములు, నలుఁగులుఁ దుమురయ్యె [10]నులిసె ననిమిషబలముల్.

129


క.

సరసిజనాభుఁడు దక్కఁగ, సురనివహమునందు రూపు [11]సొం పెడలనివాఁ
డరిదిగ వెదకిన లేఁ డ, ప్పగుసున నెంతయును నెడరు వాటిలినతుదిన్.

130


వ. అగ్ని మారుతులం బిలిచి విష్ణుండు మీరిమ్మాయ [12]మాయునట్లుగా నాత్మయతీవ్రత
సూపి యేపారుం డని పనిచిన.

131
 1. బోషకుఁ డవును సర్వౌషధీ
 2. మును
 3. నంభోధృత్పథం
 4. నట్టిచేఁత
 5. నెలివి
 6. నుద్ధత
 7. హేతిజలంబులం
 8. దురటిల్ల
 9. కంధరంబు
 10. సురిగి ర, సులిసె
 11. సొంపు సెడని
 12. మాయించు