పుట:హరివంశము.pdf/145

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 4

97

ఔర్వుం డనుమునివలన నౌర్వానలంబు సంభవించిన ప్రకారము

వ.

అబ్భంగి నరణికరణి మధియింపఁ[1]బడు నయ్యూరువువలన నౌర్వుం డనుపేర
[2]నిరింధనుం డగుననలుండు తనయుం డై జనియించి యాకసంబు దాఁకిన యెఱమంటలు దెసలు వొదువ నొండొండ పెరుఁగుచుం దనతండ్రి యగునౌర్వమహాముని
యెదుర నిలిచి.

113


క.

కడుఁ [3]బెల్లగునాఁకలి నా, యొడ లెరియింపంగఁ దొడఁగె నొక్కట జగముల్
[4]పొడిపొడిగా దరికొనియెద, నెడపక యించుక యనుజ్ఞ యిము మహాత్మా.

114


వ.

అనునవసరంబున లోకపితామహుండు సనుదెంచి యోర్వునిచేత నభివాదితుం
డై నీపుత్రున కాహారంబును నివాసస్థానంబును నొసంగెద జగద్దాహంబున
దొడంగక యుండ వారింపు మనిన నతండు దేవా యేను గృతార్థుండ నైతి నిబ్బా
లునిదెసఁ ద్రైలోక్యనాథుండ వగునీవు భావంబు సదయంబుగా నిలుపుటం
[5]గడవ మే లెయ్యది యట్ల చేయుదు ననుటయు నవ్విశ్వగురుండు.

115


ఉ.

అంబుధిలోన బాడబముఖాకృతి [6]నీతఁడు దాల్చి పెల్చఁ దో
యంబులు గ్రోలుచుండుఁ బ్రళయావధియందు మదీయరౌద్రతే
జంబును దన్నుఁ బొందఁగ నసహ్యసముద్ధతితో సమస్తలో
కంబులు నీఱుసేయు నది గార్యము నావుడు నమ్మునీంద్రుఁడున్.

116


వ.

అవ్విధం[7]బ యొనర్పం గొడుకు నాజ్ఞాపించె నతండును దనతేజంబు లోకబాధ
కంబు గాకుండ నుపసంహరించి సాగరంబునకుం జనియెఁ జతుర్ముఖాదులు తమ
తమ[8]నెలవుల కరిగిరి హిరణ్యకశిపుఁ డౌర్వునిం బూజించి సర్వాంగప్రణతుం డై.

117


తే.

అజుఁడు సనుదెంచి ప్రార్థించునట్టితపము, లోకమున నెవ్వరికిఁ జెల్లు నీక కాక
యేను భవదీయశిష్యుఁడ నెడరువొందు, నప్పటికి రక్ష యగువిద్య యానతిమ్ము.

118


వ.

అనిన నమ్మహాతపోధనుండు నీవు సర్వభువనజైత్రుండవు మిత్రుండ వై న న్నాశ్ర
యించితి గావున మత్పుత్రుచేత నిర్మిత యైన[9]యనింధనాగ్నిరూప యగు విద్య
మాయ నీ కిచ్చితి సోమ[10]స్పర్శనంబు దక్కం దక్కిన యెయ్యవియు దీనికిం బ్రతికా
రంబులుగావు నీయన్వయంబున జనియించిన వారికెల్లను రిపునిగ్రహంబు వొందిన
యప్పటికి నిది వశగత యై యుండు ననియే నట్లు దైత్యపతివడసిన యవ్విశేషం
బిప్పుడు మయప్రయోగంబున నస్మద్బాధకం బైనయది.

119


క.

సితకరునిఁ బనుపు మేనును, నతఁడు నయిన నిపుడ దీని నడఁతు మనిన నా
శతమన్యుఁ డబ్ధిపతిభా, షితములకుం బ్రీతుఁడై శశిం జూచి తగన్.

120


వ.

అవ్విధం బతని కెఱింగించి.

121
  1. గడంగిన
  2. ననింధనుండగు
  3. జడ్డగు
  4. వొడివొడి
  5. గడుప
  6. వడవాముఖే౽స్య వసతిః సముద్రాస్యే భవిష్యతి. 1-45-60.
  7. బొనర్పం
  8. నివాసంబులకుం జనిరి
  9. నిరింధనాగ్ని
  10. స్పర్శంబు