పుట:హరివంశము.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

హరివంశము


క.

ఇరువాఁగునకుం గయ్యము, కర మద్భుతభంగి నమరెఁ గరిహయసుభట
స్ఫురితాంగశకలచయదం, తురమై సంగరధరిత్రి దుస్సంచరగాన్.

139


ఉ.

తార విరోచన ప్రభృతిదానవముఖ్యులు దర్పరోషదు
ర్వారసముధ్ధతిన్ బటుపరాక్రమకేళి యొనర్పఁ దన్మహో
దారత కోహటింపక శతక్రతుముందట నగ్నిదండభృ
ద్వారిపు లాదియైనసురవర్యులు గోల్తలచేసి రుక్కునన్.

140


చ.

పరిఘవిభిన్నులై ముసల[1]పాటితులై కరవాలకృత్తులై
శరపరికీర్ణు లై పరశుసంప్రవిదారితు లై గదావిభం
గురు లయి తోమరప్రకరకుంఠితులై సమరావనిన్ [2]సురా
సురలు పరస్పరాభిహతి శోణితపూరము నించి రయ్యెడన్.

141


వ.

అయ్యవసరంబున.

142


ఉ.

కోఱలు దీటుచు న్నయనకోణములన్ దహనస్ఫులింగముల్
గాఱఁగ నూర్పులం జదల గాలిని నొక్కటఁగూల బాహువుల్
నూఱును జాంచి మై వెనిచి నూఱుశిరంబులు నూర్ధ్వదిక్తటుల్
దూఱఁగఁ గాలనేమి రణదోహలి యై కడఁగెన్ సముద్ధతిన్.

143


వ.

ఇట్లు గడంగి చరణజానూరుకటినిపాతంబులం గూర్పరముష్టితలాఘాతంబుల
నిశాతహేతిప్రకరప్రహారంబులం గ్రూరసాయకవిదారణంబులం దరతరంబ బృందా
రకసైన్యబృందంబులం బొరివుచ్చుచుఁ దఱిమి యతం డైరావణారూఢుం డై
యున్న శతమన్యు నంతంతం గని యట్టహాసంబుతో నాహ్వానంబు సేసి.

144


మ.

ఇదె కంటే సురనాథ నాభుజమునం దేపారెడున్ ఘోర మై
గద నీయాదల వ్రయ్యఁ దాఁకి మెదడుం గ్రక్కించు నేఁడాదిగాఁ
ద్రిదశేంద్రుం డనుపే రడంచి విజయోద్దీపుండ నై యేన యే
లుదు సందేహ మొకింతయున్ వలవ దీలోకత్రయీరాజ్యమున్.

145


క.

అనుచుం గదియుఁడు నింద్రుడు, ఘనభిదురము వైచె ఘోరకఠినదనుజుఁ ద
ద్ఘనవక్షస్స్థలపాతం, బునఁ గుంఠితధార మయ్యెఁ బొలుపఱి యదియున్.

146


తే.

కులనగము లైన వ్రయ్యలై కూలునట్లు, గా నొనర్చునక్కైదు వాకరణిఁ గష్ట
భావ మొంది క్రమ్మఱ వచ్చి పాకశాస, నునికరము సేరె నెంతయుఁదనుకు సొచ్చి.

147


సీ.

ఆలోన గద [3]వూన్చి యభ్రమాతంగంబు కుంభపీఠంబు వగుల్చి యసుర
మఱియొక్కవ్రేటున మఘవువక్షంబును నొగిలించుటయును నేనుంగుఁ దాను
బీనుంగు లైనట్లు పృథివీస్థలంబునఁ గూలి గోత్రధ్వంసి కొంతవడికిఁ
దనుఁదానె సవరించుకొని గజేంద్రుని డిగవిడిచి నెమ్మనమున వెగడుఁ గదురఁ

  1. పాతితులై
  2. సురాసురులు
  3. పూంచి