పుట:హరివంశము.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము ఆ. 3.

75


మ.

బలవత్సింహచపేట[1]పాటితతనుప్రభ్రష్టభూషాంబరా
కులకేశప్రకరుం గరస్థలితఖడ్గు న్ముక్తపల్యాణసం
వలితగ్రీవవికీర్ణకేసరమృతాశ్వప్రాంతసంస్థున్ రజః
కలుషశ్మశ్రుముఖుం బ్రసేనుఁ గనియెం గ్రవ్యాద[2]సంవేష్టితున్.

181


వ.

కని తదీయశరీరంబున నమ్మహారత్నంబు కానక యనతిదూరంబునఁ బడియున్న
సింహశవంబు నాలోకించి యచ్చోట ఋక్షపదంబు లుపలక్షించి సర్వాపేక్ష
ణీయం బగు మణికిం గల గౌరవంబు నూహించి యయ్యెలువునడుగుజాడ బిల
ద్వారపర్యంతంబు ననుసరించి వచ్చిన సహచరవర్గంబు నిలిపి బిలంబు సొచ్చి కొంత
దవ్వువోయి జాంబవత్పుత్రునకు ధాత్రి యొనరించు బుజ్జవంబులయందు.

182


క.

వీరుఁ బ్రసేను వధించె మృ, గారి యదియు జాంబవన్నిహత మయ్యె మహో
దార మగు రత్న మిదె సుకు, మారక నినుఁ జేరె నేడ్పు మానుమ యింకన్.

183


వ.

అనునెలుం గాకర్ణించి రయంబున.

184


క.

అంతర్బిలమున కేఁగి య, నంతద్యుతినూత్న మైన యారత్నము నం
తంతఁ గని కదియుటయు మది, నెంతయు భయ మంది దాది హృదయంబడరన్.

185


వ.

కావవే యని పలుక నయ్యార్తరవంబునకు జూంబవంతుండు పఱతెంచి.

186


మ.

అతనిం గాంచి యుదగ్రకోపమున బాహాబంధురవ్యూహనో
ద్ధతిమై నాఁకినఁ గృష్ణుఁడుం [3]బటుభుజవ్యాఘాతనిర్ఘాతసం
పతనాభీలబలంబునం దొడరె నిబ్బంగిన్ రణం బేకవిం
శతిసంఖ్యాకలితాహముల్ హరికి ఋక్షస్వామికిం జెల్లఁగన్.

187


వ.

యాదవేశ్వరుని యనుచరు లక్కడ నేఁడెనిమిదిదివసంబులు గాచికొనియుండి బల
దేవానుజుఁడు బిలాంతరంబు వెలువడఁ డయ్యెఁ బ్రాణంబులతో నున్న నిన్నాళ్లేల
తడయు ననుచుం జేటు సొచ్చి మగుడిపోయి కృష్ణుండు నిహతుం డయ్యె నని
చెప్పిన.

188


క.

శోకించి చుట్టములు పర, లోక విధులు నడుప నిర్విలోపత విహితా
నేకతిలపిండదానము, లాకృష్ణున కట యొనర్చె నాప్యాయనమున్.

189


వ.

దానం జేసి యతండు సత్త్వహానిం బొందక యెప్పటియట్ల యుండె జాంబవంతుండు
నిరాహారత్వంబుకతనను బ్రబలసంప్రహార[4]భేదంబులవలనను బలహీనుం డై
యోటువడి యద్దేవునకు సవినయప్రణామం బొనర్చి.

190


మ.

సురగంధర్వభుజంగ[5]మద్యుచరరక్షోముఖ్యులు న్నీదెసం
బరిభావం బొనరింప నోప రని మదమద్భావంబునం దోఁచె నె
వ్వరు తిర్యగ్భకు లైన మాదృశులు దేవా నిన్ను మత్స్వామి దా
శరథిం బ్రాప్తపునస్సముద్భవునిఁగా శంకించెదం జెప్పవే.

191
  1. పటిష్ఠ, వరిష్ఠ.
  2. సంశ్లిష్టితున్
  3. బ్రతి
  4. భేదంబునను
  5. ముఖ్యవర