పుట:హరివంశము.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

హరివంశము


జోవిసర మెసఁగ నన విని, యావిభుఁ డల్ల నగి వార లందఱతోడన్.

173


వ.

అతని నర్కప్రసాదలబ్ధరత్నుం డైన సత్రాజిత్తుం గా నెఱింగించె నట్లు సనుదెంచి
సరోజినీ[1]బాంధవసఖుండు సుఖంబున నున్నంత.

174


ఉ.

నిచ్చలు నమ్మహామణి వినిర్మలకాంచనరత్నభారముల్
పొచ్చెము యెన్మిది ప్రభూతముగాఁ గురియున్ ధరిత్రిఁ దా
నెచ్చట నుండె నచ్చటికి నేయుపసర్గము నేభయంబు నే
యచ్చికయున్ జనింపక సమంచితసుస్థితి నిచ్చు నిచ్చమై.

175


మ.

అది దామోదరుఁ డుగ్రసేనునకు నొయ్యం జేర్పఁగాఁ గర్జమున్
మది నూహించుచు నుండుఁ గృష్ణుఁ డడుగన్ మానోచితుం డివ్విభుం
డిది యీకుండను రాదు వేఱొరుల కే నె ట్లిత్తు నంచుం బొరిన్
దదనుధ్యానము చేయుచుం దలఁకు సత్రాజిత్తుఁ డెల్లప్పుడున్.

176


వ.

కృష్ణుండును గులంబులోనం [2]గలహంబు పుట్టు నని తలంచి తాను శక్తుం డయ్యును
గొననొల్లక యయ్యైప్రసంగంబులం గోర్కి సన్నవాఱం బలుకుచుండఁ జుట్టంబు
లందఱు నెఱింగి యుండుదు రిట్లు సత్రాజిత్తు జనార్దనునివలన శంకించి యమ్మాణి
క్యంబు ప్రసేనున కిచ్చె [3]నదియును నశుచియైనవాఁడు దాల్చినం దనగుణంబులు
సూపక ప్రాణాపద నొనర్చు నత్తెఱం గయ్యిరువురు నెఱుంగ రంత.

177


సీ.

ఆప్రసేనుఁడు తురగారూఢుఁడై మహావిపినదుర్గంబుల [4]వేఁటలాడ
నొక సింహ ముగ్రమై యుఱికి గుఱ్ఱమ్ము నాతనిఁ జంపి బలుఁగండ యనుతలఁపునఁ
గ్రమ్మ రత్నము నోరఁ గబళించునంతలో నేతెంచి మృగపతి నెలుఁగుఱేఁడు
జాంబవంతుఁడు మహాసత్త్వుండు వధియించి యమ్మణి గైకొని సమ్మదమునఁ


తే.

జని బిలంబు ప్రవేశించి తనతనయుఁడు, శిశువు సుకుమారుఁ డనువానిచేతి కాడ
మానికంబును నిచ్చె నమ్మాడ్కి నవధిం, జనఁగ నారాజసుతుబంధుసముదయంబు.

178


క.

మృగయాతత్పరుఁడై చని, మగుడండు ప్రసేనుఁ డేమి మాయయు రమ్యం
బగుమణి[5]కై యేపాపులు, దెగిరో ప్రాణమున కేమి తెఱఁ గిఁక ననుచున్.

179


వ.

ఇవ్విధంబు కృష్ణకృత్యంబ కా నోపు నని యొండొరులతోడ నొయ్యనొయ్యన
[6]పలుకుచుండం గర్ణపరంపరం బరివాదంబు ప్రకటం బగుటయు లోకవేది యగు
నయ్యాదిపురుషం డాకీడు మాన్చుకొనుటకై యెవ్విధంబున నైనం బ్రసేను
చావుచే టరసెద నని చుట్టంబులు వినం బలికి యాప్తులు వెరవరులు నగుపరి
[7]చరులుం గొనిచని వింధ్యంబు ఋక్షవంతంబు ననుపర్వతంబులు గ్రుమ్మరి యొక్క
ప్రదేశంబున.

180
  1. నఖ
  2. గలంక
  3. నది యశుచి
  4. వెంటఁదిరుగ
  5. కేపాపాత్ములు
  6. మునుకు
  7. జనంబులు