పుట:హరివంశము.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76

హరివంశము


క.

అనిన నగుచు నవ్విభుఁ డా, యన కాత్మావతర[1]ణంబు నఖిలము నెఱిఁగిం
చిన నాతఁడు భక్తిసమ, ర్చనలు దగ నొనర్చె నధికసమ్మోదమునన్.

192


వ.

తదీయకరతలస్పర్శనంబున నాయతసమరశ్రమంబు నుజ్జగించి ఋక్షేశ్వరుండు.

193


క.

తనకూఁతు జాంబవతి నాఁ, జనుకన్నియఁ దెచ్చి యిచ్చె సస్నేహత న
వ్వనజేక్షణునకు నతఁడును, వనజాస్యఁ బరిగ్రహించె వాంఛ [2]యెలర్పన్.

194

శ్రీకృష్ణుఁడు జాంబవతిం బరిగ్రహించి నిజపురంబునకు వచ్చుట

వ.

అట్లు కన్యారత్నంబు నివేదించిన యనంతరంబ శ్యమంతకరత్నంబును సమర్పించినం
బ్రణతునిచేతిది గొనఁదగనిదైనను బరివాదపరిహారార్థం బయ్యర్థవిదుండు గై
కొని చరితార్థుం డై జాంబవతిం దోడ్కొని పురంబున కరుగుదెంచిన.

195


ఉ.

పౌరులు బంధుమిత్రులును భాగ్యఫలంబులు నేఁడు మాకు నిం
డారఁగఁ బండె నత్యుతుఁ డపాయ మొకింతయు లేక యిమ్మెయిం
జేరె జగంబు లన్నియును జేకుఱు నేలితి మంచు సమ్మద
స్ఫారతఁ ద్రుళ్లియాడి రెలప్రాయము వచ్చినయట్లు వృద్ధులున్.

196


క.

సకలయదువృష్ణిభోజాం, ధకసభయును వినఁగ శౌరి తనవృత్తాంతం
బొకటియుఁ దప్పక యుండఁగ, నకుటిలమతిఁ డెలియఁజెప్పె నాశ్చర్యముగన్.

197


వ.

శ్యమంతకమణియు సత్రాజిత్తున కిచ్చె నివ్విధంబున మిథ్యాభిశంసనశమనంబు
గావించికొని గోవిందుం డందఱు నభినందింప జాంబవతి నంతఃపురంబు భూషణం
బుగా నునిచెఁ బ్రాప్తరత్నుం డైన యా ప్రసేనానుజన్ముండు.

198


క.

లేని [3]ప్రయి వెట్టితిమి హరి, పై నక్కట దీని కిదియ ప్రాయశ్చిత్తం
బైనది యని తననందన, నానతుఁడై సత్యభామ నతనికి నిచ్చెన్.

199


వ.

అక్కుమారిక నక్రూరకృతవర్మశతధన్వప్రముఖు లగుయాదవు లెందఱేని
నెప్పుడు నడుగుచునికిం జేసి వాసుదేవుని కిచ్చుట దమకు నత్యంతంబును నవ
జ్ఞతగా నెక్కించుకొని సత్రాజిత్తు శత్రుంగాఁ దలంచుచుండుదు రయ్యందఱు
నొక్కనాఁడు తద్విషయం బగు [4]మంతనంబున నుండి శతధన్వున కి ట్లనిరి.

200


మ.

మన మెల్లం దన [5]తొంటిమంచితన మాత్మం గోరి కోరంగఁ గై
కొన కాకృష్ణునిసొమ్ముఁ జేసె ఖలుఁడై కూఁతున్ సహింపంగ వ
చ్చునె [6]యీపాడివిచార [7]మేమిటికిఁ దుచ్ఛున్ వీనిఁ ద్రుంగించి యెం
దు నలభ్యం బగు మానికంబు గొని సంతోషింత మంతర్గతిన్.

201


చ.

ఎఱుఁగనివాఁడ పోలె హరి [8]యివ్విధి యూరక చూచె నేని లే
దుఱక మనంబులోనఁ బగ యూఱడుచందమ యైనఁ బేర్చి యం

  1. భంగియ
  2. యలర్పన్
  3. ప్రతివట్టితిమి
  4. స్యమంతకరత్నంబు మనంబుననుండి
  5. తోడి
  6. యీపాడి; యీచెంత; యీసేఁత విచార మేమిటికి వచ్చున్.
  7. మేఁటికి నటంచున్
  8. యిప్పని