పుట:హరివంశము.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 3.

73


క.

బలదేవుఁడు రేవతియం, దలఘుబలుని సుతుని సుల్ముకాహ్వయుఁ గనియెన్
లలనలు మఱియు నతనికిం, బలువురు మదిరాదు లర్థిఁ బడసిరి సుతులన్.

163


వ.

కృష్ణునకు రుక్మిణీప్రముఖు లయిన దేవు లెనమండ్రును మఱియుం బదియాఱు
వేలునూర్వురుం గలిగిరి వారియందు లక్షయు నెనుబది[1]వేవురు కొడుకులు
పుట్టి రందఱకుఁ బ్రద్యుమ్నుండు పెద్దవాఁ డయ్యె మఱియుఁ జారుధేష్ణసాం
బాదు లనేకులు ప్రసిద్ధు లయి తనర్చిరి.

164


తే.

అనఘ వృష్ణికనిష్ఠనందనుఁడు పుణ్య, శీలుఁ డనిమిత్రుఁ డాత్మజు శినిసమాఖ్యుఁ
[2]గాంచె సత్యకుఁ డుదయించె ఘనుఁడు శినికి, సత్యకునకు సాత్యకి పుట్టె సత్యయశుఁడు.

165


వ.

అతనికి యుయుధానుం డనునామంబు ముఖ్యంబై యుండెఁ దద్వంశ్యులు
శైనేయు లనం బరఁగిరి మఱి యుథాజిత్తువంశంబు మెఱయ ననమిత్రుండు
జనియించె ననమిత్రునకు నిఘ్నుం డనువాఁడు పుట్టె నిఘ్ను నకుఁ బ్రసేన
సత్రాజిత్తులు పుట్టిరి.

166

సత్రాజిత్తు సూర్యు నారాధించి శమంతకమణి సంపాదించుట

క.

సత్రాజిత్తు విమలచా, రిత్రమునకు నాత్మలోనఁ బ్రియ మంది తగన్
మిత్రుం డయ్యె ద్రిభువన, [3]మిత్రుఁడు మిత్రుండు కృప నమిత్రధ్వంసీ.

167


వ.

అట్టిసత్రాజిత్తు సముద్రతీరంబున నిలిచి నియుతుండై పదునొకండుదినంబులు సూర్యు
నారాధించిన బ్రసన్నుఁ డై యద్దేవుం డతనికి మేలు సేయు తలంపువం బెంపారు
మూర్త్యంతరంబు ధరియించి తదగ్రభాగంబున నిలిచిన నతనికిఁ బ్రణతుం డై
వివిధ వాక్యంబులఁ బ్రస్తుతించి.

168


తే.

దేవ నీవు నభంబున నేవిధమున, వెలుఁగు దట్ల దురాలోకవిపులమూర్తి
నిచ్చటికిని విచ్చేసితి రెట్లు నిన్నుఁ, గన్నులారఁగఁ గని మేలు గాంచువాఁడ.

169


వ.

అనుటయు సూర్యుఁడు నగుచు నిది యొక్కరత్నంబు శ్యమంతకనామధేయంబు
కంఠావలంబి యైన నత్తేజంబువలన నతిసౌమ్యం బయ్యును మదీయరూపంబు నీకుం
దేఱిచూడరాకున్నది యట చూడు మనుచు నది పుచ్చి యతనికి నఱుతం బెట్టి
వరంబు వేఁడు మని పలికిన.

170


క.

అతఁ డమ్మణి యీగియ యభి, మతవరముగ నడుగుటయును మార్తాండుడు న
ట్ల తగంగ నిచ్చి యంత, ర్హితుఁ డయినఁ బ్రమోద మాత్మ నెసకం బెసఁగన్.

171


వ.

మగుడి సత్రాజిత్తు ద్వారకానగరంబున కరుగుదేరం గని యెల్లవారును విస్మయ
సమ్మోహసంభ్రమంబులం గమలనాభుపాలికిం బోయి.

172


క.

దేవర దర్శించుటకై, తా వచ్చుచు నున్నవాఁడు తపసుం డిదె తే

  1. వేలు
  2. గనియె
  3. మిత్రుఁడ యన మిత్రుకున కమిత్రవిభేదీ; మిత్రుఁడు మిత్రుఁడుగా నమిత్రవిభేదీ.