పుట:హరివంశము.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

హరివంశము


గరము నిడవిగా లోకసంక్షయ[1]విధాయి, యగుచు వర్తిల్లెఁ గౌరవాన్వయవరేణ్య.

15


వ.

అందు దైత్యులచేత నాదిత్యులు పెక్కండ్రు మడిసిరి. శేషించినవారు వారి
రుహాసను శరణుసొచ్చిన నద్దేవుండు మహాదేవుం బ్రార్ధించి యుడిపి భార్గవుని
రావించి తారం దెప్పించి బృహస్పతి కిప్పించె. నప్పు డంతఃప్రసవయై యున్న
యన్నాతిం గనుంగొని యాంగిరసుం డిది మదీయతేజంబు గా దనవుడు.

16


క.

తనరునిషీకాస్తంబం, బునమఱువునఁ బువ్వుఁబోణి పుత్రుని గర్భో
జ్జనితునిఁ బావకసమతే, జుని నల్లన యుజ్జగించె స్రుక్కుచు భీతిన్.

17


తే.

జాతమాత్రుఁ డై బాలుఁడు సర్వసురల, యొప్పులును గెల్చెఁ దనమేనియొప్పుపేర్మి
నతనిఁ జూచి వేల్పులు విస్మితాత్ము లగుచు, సంభ్రమావేశ మొందఁ దజ్జననిఁ బిలిచి.

18


ఉ.

సోమునిపట్టియో గురునిసూనుఁడొ యీతఁడు దీని యున్నరూ
పేమియుఁ గొంక కీవు ధవళేక్షణ చెప్పు మనంగ సిగ్గునన్
భామిని గీడుమే లొకఁడు పల్కద దానికి నల్గి తత్సుతుం
డామగువన్ శపించుటకునై కడఁగన్ బరమేష్ఠి గ్రక్కునన్.

19


ఉ.

ఆతని మాన్చి తారఁ గడుఁబ్రార్థన మొప్పఁగ బుజ్జగించి భా
మా తెలియంగఁ జెప్పు మసమానవిభానిధి యైన యీతనూ
జాతునిహేతు వై నతఁడు [2]సత్య మొకానొకఁడెవ్వఁ డన్న నా
శితమయూఖుఁ డంచు సరసీరుహలోచన యొయ్యఁ బల్కినన్.

20


క.

చనుదెంచి సోముఁ డప్పుడు, తనయుఁ దిగిచి కౌఁగిలించి తన్మస్తము మూ
ర్కొని బుధుఁ డనునామ మతని, కొనరిచె మునిదేవతాసముత్కర మలరన్.

21


వ.

బృహస్పతియుఁ దారం గైకొని చనియె. సురలు సురజ్యేష్ఠుని వీడ్కొని నిజ
నివాసంబుల కరిగి. రట్టిదారుణం బగు గురుదారహరణదురితంబున.

22


తే.

రాజయక్ష్మరోగార్తుఁ డై రాజు ప్రతిది, నంబుఁ బ్రక్షీణమండలత్వంబు నొంది
తండ్రి శరణంబు సొచ్చిన దయ దలిర్ప, నత్రి తత్పాపపరిహార మాచరించె.

23


క.

ఆవెరవునఁ గ్రమ్మఱఁగఁ ద, నూవృద్ధి వహించి విధుఁడు నూతనకాంతి
శ్రీవిలసిల్ల జగత్త్రయ, జీవనహేతు వనువినుతి నేకొని వెలిఁగెన్.

24


క.

ఈయాఖ్యానము భక్తిం, బాయక చదివినను వినినఁ [3]బాపరహితుఁడై
యాయుర్వర్ధనపుత్ర, శ్రీయుక్తియుఁ దనరి నరుఁడు చెన్నొందు నిలన్.

25


ఉ.

సోమతనూజనందనుఁడు సుందరమూర్తి పురూరవుండు ల
క్ష్మీమహిమన్ వెలింగెఁ బరిశీలిత[4]యజ్ఞుఁ డుదాత్తుఁ డార్తర
క్షామణి యుద్ధశౌండుఁడు విచక్షణుఁ డక్షతసత్త్వుఁ డత్యుదా
త్తామలచిత్తుఁ [5]డాత్మపరమార్థవివేకుఁ డనంగ నున్నతిన్.

26
  1. కరంబు, న
  2. సత్యముగా
  3. బాతక
  4. యజ్వుఁడు
  5. డాత్త, ఆర్త.