పుట:హరివంశము.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ, 3

55


ఉ.

[1]తొంబదివేలపద్మములు తోరపుసంఖ్యగ నొప్పునట్టి య
బ్దంబులు దారుణం బగు తపం బొనరించిన నిచ్చ మెచ్చి య
య్యంబుజసూతి యోషధుల నప్పుల విప్రుల నేలువానిఁగాఁ
బంబిన వేడ్కతో నతనిఁ బట్టము గట్టిన నత్యుదగ్రతన్.

7


శా.

రాజై యాతఁడు బ్రహ్మ యిచ్చిన యనర్ఘస్యందనం బెక్కి నీ
ర్వ్యాజస్ఫూర్తి త్రిసప్తవారములు పారావారపర్యంతధా
త్రీజైత్రత్వము నొంది యాత్మమహిమన్ శ్రీ లెల్లఁ దన్ జేరఁగా
రాజత్తేజము గాంచెఁ బ్రస్ఫురితసామ్రాజ్యైకపూజ్యస్థతిన్.

8


వ.

అట్టి యైశ్వర్యంబునకుఁ బ్రియం బంది ప్రాచేతసుం డగు దక్షుండు తన కూఁతుల
నిరువదియేడ్వురఁ బత్నులంగా నొసంగినం గైకొని యారాజు రాజసమాజపూ
జితం బగు రాజసూయం బొనరించునెడ నత్రి హోతయు [2]భృగుం డధ్వర్యుండు
[3]నారదుం డుద్గాతయు బ్రహ్మ బ్రహ్మయు [4]సనత్కుమారప్రముఖపరివృతుం డగు
నారాయణుండు సదస్యుండును నై రప్పరమపుణ్యుం డగణ్యహిరణ్యరత్నరజ
లరాశిభాసితం బగు త్రైలోక్యంబును యజ్ఞదక్షిణగా నిచ్చె నని చెప్ప విందుము.

9


తే.

ద్యుతియుఁ బుష్టియుఁ దుప్టియు ధృతియుఁ బ్రభయు
వసువు కీర్తియు ననుపేరివనిత లతనిఁ
బొంది రట్టియైశ్వర్యవిస్ఫూర్తి నెందుఁ
బరఁగి యతఁడు [5]మదిమది భ్రాంతి గదిరి.

10

చంద్రుఁడు బృహస్పతి భార్య యగు తారం గొనిన ప్రకారము

చ.

సురగురు భార్యఁ దార యను సుందరిఁ బుణ్యచరిత్రఁ దత్పతిన్
బరిభవ మొందఁజేసి కనుబల్మి హరించి మహామునీంద్ర ని
ర్జరవరు లెంత చెప్పినను సక్తిమెయిన్ విడువంగ నొల్ల కు
ధ్ధురతయ చూపుచున్ సతతదోహలతన్ విహరించుచున్నెడన్.

11


వ.

వాచస్పతిజనకుం డగు నంగిరసునకు శిష్యుండు గావున శుక్రుం డాబృహస్పతి
పక్షం బంగీకరించె. భార్గవస్నేహంబున భర్గుం డజగవం బనుచాపంబు గైకొని యాటో
పంబున గురునివాఁడై నిలిచె. నప్పుడు చంద్రాపరాధంబులోని వారిన కా నిరూపించి.

12


క.

పురహరుఁడు బ్రహశిర మను పరమాస్త్రం బమరవరులపైఁ దొడిగినఁ ద
చ్చిరకీర్తి యెల్ల నాశముఁ, బొరసెను బలహీను లైరి పొలుపఱి వారల్.

13


వ.

ఇట్లు నిస్తేజు లైన [6]యహితులతెఱం గెఱింగి దైతేయులు గడంగిన.

14


తే.

దారుణం బగు సమరంబు దారకామ, యంబు నాఁగ దేవతలకు నసురలకును

  1. 'పద్మానాం దశతీ ర్దశ' అని మూలము. 1-25-18 = వేయి పద్మముల యేండ్లు అర్థ మని నీలకంఠుఁడు.
  2. భృగు వధ్వర్యుండు
  3. హిరణ్యగర్భుం
  4. సనత్కుమారాదిముని
  5. మఱిమఱి
  6. యమరుల