పుట:హరివంశము.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 3

57


చ.

సురలకు లేనియాతని విశుద్ధగుణంబుల కాత్మ నెంతయుం
గరఁగి వధూజనైకతిలకం బగు నూర్వశి కాన వచ్చి ని
ర్భరవిభవోత్సవస్ఫురితభక్తి వరించిన నాదరించి యా
నరవరుఁ డిష్టభోగకలనం జరితార్ధగఁ జేసె నుగ్మలిన్.

27


సీ.

మందాకినీసరి న్మహితతీరంబుల నందనంబున మేరునగతటంబు
లన్నింట హేమకూటాద్రిశృంగంబుల గంధమాదనశైలకందరములఁ
జైత్రరథాంతరఫలముల నలకాపురంబున మఱియు నిర్జరవిహార
లలితదేశము లెన్ని గలిగె నం దెల్ల నయ్యింతియుఁ దాను నశ్రాంతకేళి


తే.

[1]నైదు నేడును నెనిమిది నాఱుఁ బదియు, బదియు నైదును నెనిమిది వరుసతోడ
నేఁడు లొక్కొక్కచోటఁగా నెంతయేనిఁ, గాల ముద్వేలసౌఖ్యాబ్ది నోలలాడె.

28


వ.

అమ్మహారాజునకు రాజధాని యై భాగీరథి యుత్తరకూలంబునఁ బ్రతిష్ఠానం బను
పురంబు సుప్రతిష్ఠంబు లగు గరిష్టసంపదల నొప్పారె. నంత.

29

రజి యనురాజుచరిత్రంబు సంక్షేపంబుగా నెఱిఁగించుట

క.

ఆయువును నమావసువు దృ, ఢాయువును వనాయువును శతాయువు ననఁగా
నాయూర్వశియం దతనికి, ధీయుతు లుదయించి రధికతేజులు పుత్రుల్.

30


వ.

అం దగ్రజుం డైన యాయువునకు నహుషుండును వృద్ధశర్ముండును రంభుండును
రజియును ననేనుండు నన నేవురుకొడుకులు పుట్టిరి. వారిలో రజికిఁ బంచశత
తనూజులు జనియించి రాజేయు లనం బ్రఖ్యాతులయి. రాసమయంబున.

31


క.

అమరులు నసురలు నీసున, సమరమునకుఁ దొడఁగుచుండి సన్నతులయి య
క్కమలజు నడిగిరి తమలో, నమరఁగ నెవ్వరికి విజయ మగు నని యధిపా.

32


వ.

అడిగిన నద్దేవుండు వారి కి ట్లనియె.

33


క.

ఘోరాయుధకరుఁ డై యె, వ్వారికినై కడఁగి యాహవం బొనరించున్
వీరవరుఁడు రజిభూపతి, వారలఁ ద్రిలోక్యవిజయవైభవ మొందున్.

34


క.

ధృతి యుండును రజి యున్నెడ, ధృతిఁ బాయక శ్రీ వెలుంగు ధృతియు సిరియు సం
గత మయినచోట విజయో, న్నతి ధర్మము దాన [2]యమరు నావుడుఁ బ్రీతిన్.

35


వ.

ఆ రాజు రాహుదౌహిత్రుండు గావున మాతృవంశంబువా రగుటం జేసి
దైతేయు లాతని నాత్మీయసాహాయ్యకంబునకు నభ్యర్థించిన నతండు.

36


క.

దివిజుల జయించి మిమ్మును, దివిజుల నే నేలువాఁడఁ దెల్ల మిది ప్రియం
బవునే యనవుడు నొడఁబడ, కవనీవల్లభునితోడ ననిమిషవైరుల్.

37


వ.

మాకు నధీశ్వరుండు ప్రహ్లాదుండ. యస్మదీయం బగు నుత్సాహం బఖిలంబును దద
ర్థంబ యీసమయంబున కమరు లియ్యకొనినం గొనిరి కాని యే మొల్ల మనిన
ననిమిషు లవ్విధంబునకు నిచ్చగించి యతనికి నింద్రత్వం బిచ్చువారై. రంత.

38
  1. ఎలమిఁ బదియును బదియేను నిరువదియును, నేడు నెనిమిదియును బదియేడు నైదు
  2. ఎలసి