పుట:హరవిలాసము.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62 హరవిలాసము



తే. ధాతుతామ్రాధరుఁడు దేవదారుభుజుఁడు, సానువక్షస్థలుఁడు వటస్కంధుఁడైన
మంచుగుబ్బలిరాజు సంభ్రమముతోడ, ఋషిసమూహంబు నతిభక్తి నెదురుకొనియె. 54

సీ. విధిమార్గ మొక్కింత వీసరవోకుండ, నర్ఘ్యపాద్యాదిక్రియాకలాప
మాచరించి వినిర్మలాచారసంపన్ను లగునమ్మహర్షుల నాదరమున
నంతఃపురానకు నల్లఁ దోడ్కొ ని పోయి క్రమముగా నుచితాసనముల నునిచి
స్వాగతకుశలవార్తానుపూర్వకముగ నతిగభీరప్రస్ఫుటాక్షరముల
తే. వారితో నిట్టులనియె నమ్మేరుసఖుఁడు, గాఢవినయావనతపూర్వకాయుఁ డగుచు
హస్తయుగళంబు మొగిచి సంప్రార్థనమున, యావదర్థపదం బగునట్లు గాఁగ. 55

తే. అపపయోదసముద్భవం బైనవాన, యనధిగతపుష్పజాలకం బైనఫలము
పుణ్యనిధులార! నాగృహంబునకు మీరు, తలఁపుగానితలంపుగాఁ దారసిలుట. 56

క. రెంటను నేఁ బావనుఁడను, వింటిరె మునులార! మీపవిత్రాంఘ్రులు న
న్నంటుట మదీయమూర్ఖము, వెంటంగా నభ్రగంగ వెల్లివిరియుటన్. 57

సీ. స్థావరం బగుమేను పావనత్వముఁ జెందె భవదీయపాదసంస్పర్శనమునఁ
గడగంటి నాజన్మ కతికృతార్థతఁ బొందఁ గన్నులారఁగ మిమ్ముఁ గానఁబడసి
యువత్కృపాసమభ్యుదితసంతోషంబు నిండి దైవాఱె నా నెమ్మనమున
మీతేజమున నాదుమేనిలోఁ దహతహ కలుషాంబుపటలంబు గ్రాఁగి పోయె
తే. ననుఁ గృతార్థుని జేయఁ బావనుని జేయఁ, బరమపుణ్యునిఁ జేయ సంపన్నుఁ జేయఁ
దలఁచి యేతెంచితిరి గాని తక్కుగలదె, కార్య మానతి యిం డార్యవర్యులార! 58

మ. అని పర్జన్యకఠోరగర్జ కెనగా నాడంబరాటోపముం
జెనయం బల్కుగభీరనిస్వనమునన్ శీతాచలేంద్రుండు ప
ల్కిన నందందఁ బ్రతిధ్వను ల్మణిగుహాగేహంబులం దుండఁగా
నినుమార్పల్కినరీతిఁ దోఁచె నపు డూహింప మునిశ్రేణికిన్. 59

వ. అప్పు డంగిరసుం దందఱిమునులయనుమతి నప్పర్వతేంద్రున కిట్లనియె. 60

క. సర్వము సంపన్నంబగు, నుర్వీధరసార్వభౌమ యుల్లము నీకున్
సర్వోన్నతంబు గాదె య, ఖర్వము లగునీమహాశిఖరములభంగిన్. 61

వ. చరాచరభూతజాలంబులకు నాధారుండ వగునిన్నుం బురాణబ్రహ్మవాదులు విష్ణుం డని స్తుతింతురు. సప్తపాతాళభవనగోళమూలాధారంబ వగునీవు భూభువనంబు భరియింపనినాఁడు భుజంగమశేఖరుండు మృణాలపేశలం బగుఫణామండలంబున నిడి భరింప సమర్డుం డగునే? సత్పావనంబులును నాసేతుసముద్రావనిచిహ్నంబులు నగు నీసలిలప్రవాహంబులు భవత్కీర్తితీర్థంబులుంబోలి భువన పావనంబులు. తిర్య