పుట:హంసవింశతి.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యా మెఱుఁగారుఁబోఁడి జిగియబ్బెడి గుబ్బల చాకచక్యమా
యేమని చెప్పవచ్చు జగతీశ్వర! శాశ్వతరూపసంపదల్. 58

క. దాని జిగి దాని కులుకును
దాని తనుద్యుతులసొంపు దాని విధంబున్
దాని వగ దాని యందము
మానవవర! మరుఁడు గన్న మగ్నుఁడు గాఁడే! 59

క. వగ లొలుకు ధాగధగ్యపు
జిగి గుల్కెడు నుబ్బుగబ్బిసిబ్బెపుగుబ్బల్
నిగనిగలు గులుకు కొప్పును
సొగసుం దెలికనులు దాని సొమ్మై పరఁగున్. 60

ఉ. విండ్లకు మేల్తరంబు ఘనవేణి కనుంబొమదోయి బంగరుం
గిండ్లకు మేటిసాటి తులకించు చనుంగవ లేఁతతమ్మి పూఁ
దూండ్లకు మిన్నయన్న జిగిఁదొల్కెడు చేతులు లోకమందుఁ బూఁ
బోండ్లను గానమో వినమొ పోలరు తత్సతి కాలిగోటికిన్. 61

సీ. కబరీభరమునకుఁ గందంబు సెల్లు ను
త్పలమాలికలు నేత్రములకుఁ జెల్లుఁ
గర్ణంబులకును మంగళమహాశ్రీ సెల్లు
గాత్రంబునకుఁ జంపకంబు జెల్లు
మధురవాగ్వృత్తికి మత్తకోకిల సెల్లుఁ
జనుగుబ్బకవకు మంజరియుఁ జెల్లు
బిరుదైన పిఱుఁదుకుఁ బృథ్వివృత్తము చెల్లు
మధ్యంబునకుఁ దనుమధ్య చెల్లుఁ
తే. బాదముల కంబుజము చెల్లుఁ బరఁగు నడకుఁ
దనరు మత్తేభవిక్రీడితంబు సెల్లుఁ
గృతుల వర్ణింపఁదగు తదాకృతులె కృతులు
వాంఛలే దానిఁ బొందినవాఁడె సుకృతి. 62