పుట:హంసవింశతి.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బంగాళ వంగ కళింగ లతాంగులఁ
గుకురు కేరళ కురు కోకకుచల
మళయాళ నేపాళ మాళవ యువతుల
మత్స్య వత్స కరూశ మానవతులఁ
గోస లాంధ్ర వరాట కుంతల స్త్రీలను
బాంచాల బర్బర భామినులను
తే. ద్రవిళ గాంధార కాశ్మీర ధరణిసతుల
మగధ కొంకణ టెంకణ మానినులను
మఱియుఁ దక్కిన ధారుణీమండలములఁ
దనరు చెలువలఁ జూచితి ధరణినాథ! 54

తే. రాజ వశ్యౌషధాకృతుల్ రమ్యతర ర
తిస్వరూపలు మోహన దివ్యమూర్తు
లతులతర కామమంత్ర దేవతలు వీర
లనఁగ నుందురు సుందరు లచట నచట. 55

సాతానిసతి హేమావతి

ఉ. ఈ నవఖండమండితమహీస్థలి నెల్లఁ గనంగ దేవ! నే
నీ నగరీలలామమున నెంతయు రేఖఁ జెలంగు మన్మథా
ధీనసుమోహనాకృతి రతిన్నగు మిన్నగు సౌరుగల్గు సా
తాని బిసప్రసూనదళ ధాళధళీ తరళాక్షిఁ జూచితిన్. 56

తే. దాని ప్రియనాయకుఁడు విష్ణుదాసుఁ డనెడు
పేరు గలవాఁడు కలవాఁడు పెద్దవాఁడు
హేమవతి యనఁదనరు నయ్యింతిఁ బొగడఁ
దరమె బ్రహ్మకునైన శంకరునకైన. 57

ఉ. ఆ మధురాధరకచాళికనద్ఘననైగనిగ్యమా
యామృదులోరుసారరుచిరాంబురుహాక్షుల ధాళధళ్య మా