పుట:హంసవింశతి.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

జనములు సిద్ధక్రియలును
దనరఁగ శివసత్తి భూమిధవున కొసంగెన్.

49. వ. ఇట్లొసంగిన వినయంబున లేచి కైకొని స్వాగతం బడిగిన సంతోషించి మనోరంజనార్థంబు ధర్మార్థకామమోక్షంబులు రాజ్యలక్షణంబులుఁ బురాణేతిహాసంబులుఁ గొన్ని లోకాభిరామంబులు ననాగతవర్తనంబులు నుచితానుకథాస్వారస్యంబులుఁ దెలిపిన విని మహాత్మురాలా! నీవు వినని కనని కార్యంబులు ముల్లోకంబుల నెవ్వియు లేవైన నొక్కటి యడిగెద నాన తిమ్మని యిట్లనియె.

50. క. ఏ యే భూములఁ జూచితి
వేయే రాజ్యములఁ గలరు శృంగారకళా
ప్రాయలగు రూపరేఖా
శ్రీయుతి గల కన్నె లనిన శివసత్తి యనెన్.

51. మ. మది రంజిల్లఁగఁ జెప్పెదన్ వినుము ప్రేమన్ సచ్చిదానంద సం
పదచేతన్ గరజంభలంబుగతిఁ గన్పట్టున్ ధరాధీశ! యీ
యుదయాస్తాచలసేతుశీతనగమధ్యోద్యద్ధరాచక్ర మిం
పొదవన్ దేశములందు నుండుదురు విద్యుద్వల్లికాభాంగనల్.

52. ఉ. డెబ్బదిరెండు పాళెముల ఠీవిఁ దనర్చు సమస్తదుర్గముల్
జొబ్బిలుకల్మిఁ బట్నములుఁ జొక్కపుఁబేఁటలుఁ బాతకంబు పో
ద్రొబ్బెడులీలఁ జాల్తిరుపతుల్ గనుగొంటిని నుందు రందులన్
సిబ్బెపు నిబ్బరంపుజిగిఁ జిక్కని చక్కని గుబ్బ గుబ్బెతల్.

53. క. వెలనాడు వేఁగినాడును
బులుగులనా డ్పాకనాడు పొత్తపినాడున్
గల ములికినాడు రేనా
డలయక కనుఁగొంటి నచటి యబలలఁ గంటిన్.

54. సీ. లాట కర్ణాట మరాట వధూటులఁ
బాండ్య పౌండ్ర విదర్భ పద్మముఖుల